తండ్రిని హత్య చేసిన కొడుకులు
ఆలేరు నవంబర్ 20 (నిజం న్యూస్)
యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండల పరిధిలోని తూర్పుగూడెం గ్రామంలో కొడుకులు కన్న తండ్రి ని హత్య చేసిన ఘటన ఈ విషయమై ఆలేరు ఎస్.ఐ. ఇద్రిస్ ఆలీ తెలిపిన వివరాల ప్రకారం తిప్పబత్తిని భాస్కర్ వయస్సు: 45 సం.రాలు. వృత్తి: డ్రైవరు, తేది 20.11.2022 (ఆదివారం) నాడు మధ్యాహ్నం 12.30 గంటల సమయం లో తూర్పుగూడెం గ్రామం లో అతని ఇంటి వద్ద తన భార్య మరియు కొడుకుల తో గొడవ పడగ అతని భార్య కరుణారాణి మరియు ఇద్దరు కుమారులు తిప్పబత్తిని తరుణ్, తిప్పబత్తిని బాల తేజ లు కలిసి కత్తి తో గొంతు లో పొడవగ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడనీ తెలిపారు.ఈ మేరకు వారి పై కేసు నమోధు చేసి ధర్యాప్తు చేపట్టామని తెలిపారు.