విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ముట్టడి

విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని
– ఏఐఎస్ఎఫ్ ఆధ్యర్యంలో జిల్లా కలెక్టర్ ముట్టడి
– ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి పుట్ట లక్ష్మణ్
రంగారెడ్డి జిల్లా బ్యూరో నవంబర్,19(నిజం న్యూస్): విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని ఏఐఎస్ఎఫ్ అధ్వర్యంలో రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ ముట్టడించారు
ముఖ్య అతిధి గా విచ్చేసిన ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి పుట్ట లక్ష్మణ్ మాట్లాడుతూ కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు విద్యార్థులు సమస్యలు పరిష్కరించడంలో విఫలం చెందాయి. దేశంలో బీజేపీ ప్రభుత్వం నూతన జాతీయ విద్యావిధానం తీసుకొచ్చి విద్యార్థులను కాషాయీకరణ, మతోన్మాదం వైపు బలవంతంగా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఈ విద్యావిధానాన్ని రద్దు చేయాలనీ డిమాండ్ చేశారు రాష్ట్రంలో సాంఘిక సంక్షేమ హాస్టల్ విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని, పెంచిన ఇంజనీరింగ్ ఫీజులను తగ్గించాలని, పెండింగ్లో ఉన్న 5 వేల కోట్లు స్కాలర్షిప్స్, ఫీజురీఎంబర్స్మెంట్ నిధులు వెంటనే విడుదల చేయాలనీ, రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న మండల విద్యాధికారుల పోస్టులను భర్తీ చేయాలనీ, ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయాలనీ, ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు సమస్యలు పరిష్కరించని యెడల భవిష్యత్తులో ప్రగతి భవన్ ముట్టడిస్తాం అని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు పి. శివకుమార్ గ్యార క్రాంతి కుమార్, డిప్యూటీ సెక్రటరీ పవన్ , ఉపాధ్యక్షులు వినోద్, సహాయ కార్యదర్శులు వంశీ, వెంకటేష్, నాయకులు అరుణ్, శ్రీకాంత్, పల్లపు శివ,ప్రవీణ్, కృష్ణ, రాజు, అక్షిత్. వందల మంది విద్యార్థులు పాల్గొన్నారు