Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

ఎమ్మెల్సీ కవిత బేషరతుగా క్షమాపణ చెప్పాలి

– బిజేపీ జిల్లా కార్యదర్శి పొట్టి రాములు
రంగారెడ్డి జిల్లా బ్యూరో నవంబర్,19(నిజం న్యూస్): బిజెపి ఎంపీ ధర్మపురి అరవింద్ ఇంటిపైన టిఆర్ఎస్ గుండాల దాడిని నివసిస్తూ బిజెపి ఆదిభట్ల మున్సిపాలిటీ ఆధ్వర్యంలో బొంగులూరు గేటు సాగర్ రహదారి పైన నిరసన కార్యక్రమం నిర్వహించారు ఈ సంద్భంగా బిజేపీ జిల్లా కార్యదర్శి పొట్టి రాములు మాట్లడుతూ ఎంపీ ధర్మపురి అరవింద్ పై పరుష పదజాలంతో అనుచిత వాక్యాలు చేసిన ఎమ్మెల్సీ కవిత బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు మరోసారి ఇలాంటి చర్యలకు పూనుకుంటే ప్రతి చర్యలు ఉంటాయని హెచ్చరించరు అరవింద్ ఇంటి పైన దాడినీ కేంద్ర నాయకత్వం చాలా సీరియస్ గా తీసుకుందని దాడి పాలడ్డ. తెరాస గుండాల పైన వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో బిజేపీ మీడియా సెల్ కన్వీనర్ ఉడుతల అశోక్ గౌడ్, మాజీ ఎంపీపీ ఈశ్వర గౌడ్ ,ప్రధాన కార్యదర్శి నరసింహారెడ్డి అధ్యక్షుడు వినయ్ కిసాన్ మోర్చా అధ్యక్షుడు భాస్కర్ రెడ్డి యువ మోర్చా నాయకుడు మహేష్, వెంకట్ రెడ్డి, కౌశిక ఐలయ్య శేఖర్ రెడ్డి మహిళా మోర్చా నాయకురాలు శ్రీదేవి, సతీష్ జంగయ్య వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు