ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో ఐదు శాతం వికలాంగులకు కేటాయించాలి

– డిసెంబర్ 26 నుండి 28 హైదరాబాద్ లో ఎన్ పి ఆర్ డి జాతీయ మహాసభలు
– ఎన్ పి ఆర్ డి జిల్లా ప్రదాన కార్యదర్శి జేర్కోని రాజు
రంగారెడ్డి జిల్లా బ్యూరో నవంబర్,19(నిజం న్యూస్): ప్రభుత్వ అన్ని సంక్షేమ పథకాలలో వికలాంగులకు ఐదు శాతం కేటాయించాలని సకలాంగులతో పాటు వికాలాoగులకు ఆత్మగౌరవం సమానత్వంతో చూడలని అన్నారు శనివారం మహేశ్వరం మండలం తూమ్మలురు గ్రామంలో వికలాంగుల హక్కుల జాతీయ వేదిక గ్రామ స్థాయి సమావేశం మహేశ్వరం మండలం మహిళా విభాగం మంజుల అధ్యక్షతన జరిగింది ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన జే.రాజు మాట్లాడుతూ బడ్జెట్ లో ఐదు శాతం నిధులు కేటాయించి వికలాంగుల సంక్షేమం పై ప్రభుత్వం తన చిత్తశుద్ధి నిరూపించుకోవలన్నారు. 2010 సం లో ఏర్పడిన ఎన్ పి ఆర్ డి ఈ అనతికాలంలోనే అనేక పోరాటాలు నిర్వహించిందన్నారు. ఆలిండియా మహాసభలు డిసెంబర్ 26 నుండి 28 వరకు హైదరాబాద్ లో నిర్వహిస్తున్న ట్లు ఆయన చెప్పారు ఈ మహాసభలను జయప్రదం చేయాలని ఆయన కొరారు. ఈ సమావేశంలో అనంతరం గ్రామ నూతన కమిటీ వేయడం జరిగింది
అధ్యక్షుడుగా జేనిగే ఐలయ్య ప్రదాన కార్యదర్శిగా పురుషోత్తం సహయ్య కార్యదర్శిగా అంజిరెడ్డి కమిటీ సభ్యులుగా భావని పావణ్ రామదేవి పాండురంగ చారి తదితరులు పాల్గొన్నారు