ఎంపీ అరవింద్ పైన చేసిన వ్యాఖ్యలకు నిరసన

రంగారెడ్డి జిల్లా బ్యూరో నవంబర్,19(నిజం న్యూస్): ఇబ్రహీంపట్నం మున్సిపల్ కేంద్రం సాగర్ రహదారిపై బిజెపి ఆధ్వర్యంలో కెసిఆర్ ప్రభుత్వనికి, ఎమ్మెల్సీ కవిత ఎంపీ అరవింద్ పైన చేసిన వ్యాఖ్యలకు నిరసన తెలియచేసి కెసిఆర్ దిష్టి బొమ్మ దగ్నం చేశారు ఈ కార్యమానికి ముఖ్య అతిథిగా ముత్యాల భాస్కర్,బిజెపి సీనియర్ నాయకులు నాయిని సత్యనారాయణ మాట్లాడుతూ ఇంట్లో ఎవరు లేని సమయంలో నిజామాబాదు ఎంపీ ధర్మపురి అరవింద్ ఇంట్లోకి ప్రవేశించి వాళ్ళ అమ్మను భయబ్రాంతులకు గురి చేసే విదంగా దాడి చేసిన తెరాస గుండాలను వెంటనే అరెస్ట్ చేయాలని అన్నారు, ఎమ్మెల్సీ కవిత మాటలు చూస్తే, మొత్తం కెసిఆర్ ఫ్యామిలీ కులాహంకార, దొరహంకార మాటలు మాట్లాడుతూ మొత్తం ఒక రకమైన ప్రెస్టేషన్ లో ఉన్నారని, ఎమ్మెల్సీ కవిత తెలంగాణాలో బతుకమ్మ చీరలు అంటూ తెలంగాణ ప్రజలను మోసం చేస్తూ ఇప్పుడు ఢీల్లీలో మద్యం వ్యాపారం చేస్తూ దేశ ప్రజలను మోసం చేసిన నివ్వు ఎంపీ అరవింద్ పైనా మాట్లాడేది చెప్పు తీసుకొని కొడుతా అంటావా ? ఖబర్దార్ తైతక్క నీకు మీ కుటుంబానికి తెలంగాణ లో నూకలు చేల్లినాయ్ ఇక మీ పని మంగళగిరి మాన్యాలే అని అన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు భోజిరెడ్డి, అసెంబ్లీ కన్వీనర్ ఎన్ను యాదగిరి రెడ్డి,కిసాన్ మోర్చా అధ్యక్షుడు జక్క రవిందర్ రెడ్డి, మండల అధ్యక్షులు దండే శ్రీశైలం, మోగిలి గణేష్, దొండ రామణ రెడ్డి, బీజేవైఎం మున్సిపల్ అధ్యక్షులు ముత్యాల మహేందర్, కాళిదాస్ బిజెపి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు