తృటిలో తప్పిన ప్రమాదం

మాడ్గుల నవంబర్ 19 ( నిజం న్యూస్ ): మాడ్గుల మండలంలోని ఇర్విన్ గ్రామంలో ప్రమాదవశాత్తు శనివారం నాడు సయ్యద్ అమీద్ ఇంటిపై వేప చెట్టు కూలడంతో ఆ సమయంలో ఇంటిలో ఎవరు లేకపోవడంతో ప్రమాదం తప్పిందని గ్రామ సర్పంచ్ పుష్పలత జంగయ్య యాదవ్ అన్నారు. కూలిన చెట్టును గ్రామపంచాయతీ సర్పంచ్ ఎమ్మటే స్పందించి అక్కడి నుండి కూలిన చెట్టును గ్రామపంచాయతీ ఖర్చులతో తొలగించడం జరిగింది అని తెలిపారు కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి రామ్మోహన్ రెడ్డి, ఇంటి యజమాని గ్రామస్తులు పాల్గొన్నారు