రైతులను ఆదుకునేందుకు ఎస్ బి ఐ తోడ్పాటునివ్వాలి

మాడుగుల నవంబర్ 19 ( నిజం న్యూస్):
బ్యాంకింగ్ రంగంలోనే అగ్రగామిగా వెలుగొందుతున్న ఎస్ బి ఐ శాఖ వారు రైతన్నలను ఆదుకునేందుకు నిబంధనలను సడలించి రంగారెడ్డి జిల్లాలో జరిగిన మాడుగుల మండలానికి సాయం అందించాలని జడ్పిటిసి గౌరవరం ప్రభాకర్ రెడ్డి ఎస్ బి ఐ డీజీఎంను కోరారు.శుక్రవారం రాత్రి అప్పారెడ్డిపల్లి గ్రామంలో ఎస్ బి ఐ ఆధ్వర్యంలో సర్పంచ్ పద్మ యాదయ్య అధ్యక్షతన సంధ్య శిబిరం పేరా ప్రజలకు అవగాహన సదస్సు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎస్ బి ఐ డిజిఎం మాట్లాడుతూ ఎస్ బి ఐ ద్వారా నిరుద్యోగులకు రైతులకు అనేక సేవలను అందిస్తున్నామని ప్రభుత్వపరంగా అందిస్తున్న పథకాలను గ్రామాల్లోని మహిళా సంఘాల బుక్ కీపర్ లు, బ్యాంక్ ఉద్యోగులు ప్రజలకు తెలపాలని సూచించారు.కార్యక్రమంలో ఎంపీపీ పద్మ రెడ్డి, గుడి తండా సర్పంచ్ స్వప్న సురేష్ నాయక్, ఫకీర తండా సర్పంచ్ పద్మ జగదీష్ నాయక్, జయరామ్ దండ సర్పంచ్ రూప దేవిలాల్, ఎస్బిఐ మాడుగుల మేనేజర్ సుధీర్ తో పాటు ఇబ్రహీంపట్నం, యాచారం, ఆమనగల్, మాల్ బ్యాంకు ఉద్యోగులతో పాటు అధిక సంఖ్యలో వినియోగదారులు పాల్గొన్నారు