చనిపోయాక పది రోజులకు సమాచారం
విషాదంలో కుటుంబ సభ్యులు….
నిజం న్యూస్, చండూరు నవంబర్ 20, చండూరు పట్టణానికి చెందిన ఏలే మల్లికార్జున్ (33 )ఈనెల 4న తిరుపతి అని చెప్పి వెళ్ళాడు. మార్గమధ్యలో అస్వస్థత గురి కావడంతో గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చేరారు. చికిత్స పొందుతూ 9న చనిపోయాడు. కాగా శనివారం నాడు చండూర్ పోలీసులు కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వడంతో విషయం బయటకు తెలిసింది. వెంటనే కుటుంబ సభ్యులు గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లారు. చనిపోయాక 10 రోజుల తర్వాత ఎలా సమాచారం ఇస్తారని అడగ తమలోపం కాదంటే తమలోపం కాదంటూ ఇరు ప్రాంతాల పోలీసులు చెప్పారు. ఏదేమైనా పోలీసుల తీరు పట్ల కుటుంబ సభ్యులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. తండ్రి శ్రీనివాస చనిపోవడంతో తల్లి అంజమ్మ తన ఒక్కగాని ఒక్క కొడుకు మల్లికార్జున్ పైన ఆశలు పెట్టుకొని జీవిస్తుంది. మల్లికార్జున్ ఉద్యోగం లేక చేనేత కార్మికుడిగా జీవిస్తున్నాడు . ఏదేమైనా చనిపోయిన తర్వాత పది రోజులకు సమాచారం రావడం పట్ల స్థానికంగా చర్చనీయాంశం అయ్యింది