వైద్య కళాశాలల ప్రారంభం పట్ల హర్షం

చండూరు ,నిజం న్యూస్, నవంబర్ 20…. తెలంగాణ ప్రభుత్వం చరిత్రలో కనివిని ఎరగని రీతిలో ఒకేసారి ఏకంగా 8 ఏళ్ల లో 12 కొత్త వైద్య కళాశాలలు ప్రారంభించి రికార్డు సృష్టించడం పట్ల టిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు, మునుగోడు నియోజకవర్గం ముఖ్య నేత, కే వి ఎస్ ఫౌండేషన్ అధినేత కర్నాటి విద్యాసాగర్ ఆదివారం ఓ ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు. నాడు సమైక్య రాష్ట్రంలో కేవలం 5 మెడికల్ కాలేజీలు ఉంటే నేడు స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ గారి నాయకత్వంలో వాటి సంఖ్య 17 కు పెంపు జరిగిందన్నారు ఒక్క ఈ విద్యా సంవత్సరంలోనే 8 మెడికల్ కాలేజీలు ప్రారంభించుకోవడం దేశంలోనే అరుదైన రికార్డు అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత సొంత నిధులతోనే ప్రభుత్వం మెడికల్ కాలేజీలు ప్రారంభించింది అన్నారు .సీఎం కేసీఆర్ ప్రజలకు ఏం కావాలో వాళ్ళు అడగక ముందుకే తెలుసుకునే గొప్ప నాయకుడు అన్నారు. అలాంటి వ్యక్తి మన సీఎం గా ఉండడం మన అదృష్టం అన్నారు. ఎన్నికల్లో వచ్చిన హామీలతో పాటు ఇవ్వని హామీలను కూడా నెరవేర్చిన ఘనత సీఎం కేసీఆర్ కే దక్కుతుందన్నారు. మునుగోడు ఉప ఎన్నికల్లో ఇచ్చిన అభివృద్ధి హామీలను నెరవేర్చి ప్రతిపక్షాలకు కనీసం తిరిగే అర్హత లేకుండా చేస్తారని ఆయన ధీమా వ్యక్తం చేశారు