మిర్చి పంటలో నానో యూరియా పై రైతులకు… అవగాహన సదస్సు

*శాస్త్రవేత్త లక్ష్మినారాయణమ్మ
చర్ల నవంబర్ 19 (నిజం న్యూస్) మండల కేంద్రంలో ఐ.ఎఫ్.ఎఫ్.సి.ఓ కంపెనీ వారి ఆధ్వర్యంలో నానో.యురియా వాడకం పై. శనివారం అవగాహన సదస్సు జరిగింది సదస్సు కు వి.వి.కె కొత్తగూడెం శాస్త్రవేత్త లక్ష్మీనారాయణమ్మ హాజరై మాట్లాడుతూ మిర్చి పంటలో వివిధ రకాల చీడ పీడలపై తీసుకోవలసిన జాగ్రత్తలు సస్యరక్షణ చర్యల గురించి రైతులకు వివరించారు.ఐ.ఎఫ్.ఎఫ్. సివో. స్టేట్ మార్కెటింగ్ మేనేజర్ కృపా శంకర్ మాట్లాడుతూ ప్రపంచంలోనే మొట్టమొదటి నానో యూరియా పై వివరాలు సాగరిక గోల్డ్ వాడకంపై లాభాలు వివరించారు.
ఐ ఎఫ్.ఎఫ్.సివో. సంస్థ. రైతు సహకార సంస్థ ఎరువులు వాడిన రైతులకు ఉచిత బీమా లభిస్తుందని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో శాస్త్రవేత్త శివ.ఐఎఫ్.ఎఫ్.సివో. ఫీల్డ్ మేనేజర్ నాగార్జున. మండల వ్యవసాయ శాఖ అధికారి ఏవో శివరాం ప్రసాద్. మండల రైతు సమన్వయ సమితి కోఆర్డినేటర్ కొసరాజు కుమార్ రాజా. ఆత్మ చైర్మన్ పోలిన రామచంద్రరావు. మిర్చి రైతులు పాల్గొన్నారు