మునుగోడు గెలుపు పట్ల హర్షం

*మంత్రికి శుభాకాంక్షలు తెలిపిన అంగన్వాడీలు.
సూర్యాపేట ప్రతినిధి నవంబర్ 18 నిజం న్యూస్
మునుగోడు ఉప ఎన్నికలను రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంతకండ్ల జగదీశ్ రెడ్డి తన భుజస్కాందాలపై వేసుకొని టిఆర్ఎస్ ఘన విజయాన్ని సాధించడం పట్ల టిఆర్ఎస్కెవి అనుబంధ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు శుక్రవారం స్థానిక వ్యవసాయ మార్కెట్ లో రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంతకండ్ల జగదీశ్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలసి పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా ఆ సంఘం జిల్లా అధ్యక్షురాలు తాటిపాముల నాగలక్ష్మి మాట్లాడుతూ మునుగోడు విజయంతో ఉమ్మడి నల్లగొండ జిల్లా మొత్తం గులాబీమయం అయిందన్నారు. అలాగే అంగన్వాడి గ్రేడ్ 2 సూపర్వైజర్ పరీక్ష రాసి ఎంపికైన వారి జాబితా నేటి వరకు పెట్టలేదని ఈ విషయమే కోర్టులో నడుస్తున్న విచారణను వేగవంతం చేసి వెంటనే జాబితా పెట్టేలా చర్యలు తీసుకోవాలని మంత్రికి విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ తంతెనపల్లి సుజాత, అంగన్వాడి టీచర్లు అనిత, జోష్ణ, జ్యోతి, శ్రీలత, జిల్లా కమిటీ సభ్యులు పాల్గొన్నారు