నిషేధిత సిపిఐ మావోయిస్టు.. మిలిసియా సభ్యులు అరెస్ట్.. ఎస్పీ డాక్టర్. వినీత్

చర్ల నవంబర్ 18 (నిజం న్యూస్) పూజారి కాం కేర్ కు చెందిన ముగ్గురు నిషేధిత సిపిఐ మావోయిస్టు పార్టీ మిలిసియా సభ్యులను పోలీసులు. సిఆర్పిఎఫ్ సంయుక్తంగా నిర్వహించిన కూంబింగ్ ఆపరేషన్లు పట్టుకొని అరెస్టు చేసినట్లు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ శుక్రవారం విలేకరుల సమావేశంలో వెల్లడించారు పూజారి కాంకేర్ కు చెందిన1) ముడివి వుంగ.రాంపూర్ గ్రామం హోసూర్ పోలీస్ స్టేషన్ ఛత్తీస్ గడ్.2) కోవాసి ఇమిడి. చిన్న ఊటపల్లి ఉసురు పోలీస్ స్టేషన్ సతీష్ గడ్.3) మడివి వుంగ.చిన ఊ టపల్లి . ఊసురుపోలీస్ స్టేషన్. సతీష్ గడ్ ఈ ముగ్గురు గత మూడు సంవత్సరాలు గా నిషేధిత సిపిఐ మావోయిస్టు పార్టీ పూజారి కాంకేర్ ఆర్పిసి మిలిసియా సభ్యులుగా పని చేస్తూ తెలంగాణ మావోయిస్టు పార్టీ అగ్ర నాయకుల ఆదేశాల ప్రకారం సతీష్ గడ్ తెలంగాణ సరిహద్దు ప్రాంతాల్లో సంచరిస్తూ సరిహద్దు గ్రామ ఆదివాసీలపై బెదిరింపులకు పాల్పడుతూ వారి వద్ద నుండి బియ్యం కూరగాయలు నిత్యవసర సరుకులు వసూలు చేయడం పార్టీ ఫండ్ పేరిట ప్రతి ఇంటి నుంచి అక్రమంగా డబ్బులు వసూలు చేయడం. పనుల డబ్బుల్లో వాటా వసూలు చేయడం ప్రజలను బలవంతం చేస్తున్నారని తెలిపారు.