ప్రభుత్వ పాఠశాలల్లో చేపట్టిన మాళిక వసతుల కల్పన పనులలో వేగం పెంచాలి……అదనపు కలెక్టర్ దీపక్ తివారి

యాదాద్రి భువనగిరి జిల్లా బ్యూరో నవంబర్ 16(నిజం న్యూస్)
మనఊరు మనబడి కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ పాఠశాలల్లో చేపట్టిన మాళిక వసతుల కల్పన పనులలో వేగం పెంచాలని జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ దీపక్ తివారి అధికారులను ఆదేశించారు.బుధవారం నాడు కాన్ఫరెన్స్ హాల్లో ఆయన విద్యాశాఖ,ఇంజనీరింగ్ అధికారులతో మన ఊరు మన బడి కార్యక్రమం కింద జిల్లాలో 251 పాఠశాలల్లో చేపట్టిన ఎలెక్ట్రిఫికేషన్, డైనింగ్ హాలు, మైనర్, మేజర్ రిపేర్లు, అదనపు గదుల నిర్మాణం, పెయింటింగ్, టెండర్ పనులను సమీక్షంచారు.సమీక్షలో జిల్లా విద్యాశాఖాధికారి నారాయణరెడ్డి, పంచాయతీరాజ్ శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎన్.వెంకటేశ్వర్లు, డివిజనల్ ఇంజనీర్లు హేమంత్ కుమార్, బాలచందర్, ఆర్.డబ్ల్యూ.ఎస్. డివిజనల్ ఇంజనీర్ సంపత్ కుమార్,టి ఎస్ ఈ డబ్ల్యూ ఐ డి సి డివిజనల్ ఇంజనీర్ శివకుమార్ పాల్గొన్నారు.