రఘునాథపురంలో ప్రమాదవశాత్తు వ్యక్తి మృతి

యాదాద్రి భువనగిరి జిల్లా బ్యూరో నవంబర్ 16(నిజం న్యూస్)
రాజాపేట మండలం రఘునాథపురం గ్రామానికి చెందిన బల్ల అనిల్ (24) ప్రమాదవశాత్తు రోడ్డు ప్రమాదంలో మంగళవారం మృతి చెందారు. స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన ప్రకారం, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం పాలకేంద్రం నుండి ఎప్పటిలాగే పాలను కొనుగోలు చేసుకుని ద్విచక్ర వాహనంపై ఇంటికి తిరిగి వస్తుండగా పాలక్యాను ద్విచక్ర వాహనం హ్యాండిల్ లో చిక్కుకొని వాహనం అదుపుతప్పి గ్రామంలో బస్ స్టాప్ సమీపంలో కరెంటు స్తంభానికి బలంగా ఢీ కొట్టింది రోడ్డుపై పడిన బల్ల అనిల్ తీవ్ర గాయాల పాలై అక్కడికక్కడే మృతి చెందాడు.కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఎస్సై శ్రీనివాస్ రెడ్డి కేసు నమోదు చేసుకుని ప్రభుత్వ ఆసుపత్రిలో శవాన్ని పోస్టుమార్టం చేసిన అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు.కాగా బల్ల శ్రీను పెద్ద కుమారుడైన అనిల్ మూగ చూడు కావడంతో గత రెండు నెలల నుండి పెన్షన్ పొందుతున్నాడు.బల్ల శ్రీను తండ్రి మహేశ్వరం ఇటీవల మరణించాడు. నెలరోజుల్లోనే ఆ కుటుంబంలో ఇద్దరు మరణించడం వల్ల తీవ్ర విషాదం నెలకొంది