మార్కెట్ యార్డులో పనిచేసే కార్మికులకు యూనిఫామ్ ఇవ్వాలి – శివారపు శ్రీధర్

రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
కేసముద్రం నవంబర్ 15 నిజం న్యూస్ : మార్కెట్ యార్డులో పనిచేసే హమాలీ, కూలీ, దడ్వాయి, సెక్యూరిటీ గార్డ్, గుమస్తా, బండి హమాలి, కార్మికులకు బట్టలు ఇవ్వాలని హమాలీ యూనియన్ అధ్యక్షులు మిట్ట గడుపుల వెంకన్న అధ్యక్షతన జరిగిన ధర్నాలో మార్కెట్ చైర్మన్ మరి నారాయణ రావు వినతి పత్రం ఇచ్చిన అనంతరం జరిగిన సభలో తెలంగాణ హమాలీ అండ్ మిల్ వర్కర్స్ యూనియన్ ఐ ఎఫ్ టి యు
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శివారపు శ్రీధర్ మాట్లాడుతూ
కార్మికులకు రావలసిన యూనిఫామ్ తో పాటు లైసెన్సులు మరియు గ్రూప్ ఇన్సూరెన్స్ పిఎఫ్ ఈఎస్ఐ వచ్చే విధంగా కార్మికులు ఐక్యంగా ఉండి పోరాడాలని పిలుపునిచ్చారు
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్ లేవైతే ఉన్నాయో వాటి రద్దు కోసం హమాలి, కూలీ , అసంఘటిత రంగ కార్మికులకు సమగ్ర చట్టం
చేసేవరకు పోరాడాలని పోరాటం ద్వారానే హక్కులు సాధించబడతాయని
సమాన పనికి సమాన వేతనం సుప్రీంకోర్టు తీర్పును అమలు చేసే విధంగా కార్మికులు ఐక్యంగా ఉద్యమించాలని ఇంకా మార్కెట్లో ఉన్న తదితర సమస్యలపై భవిష్యత్ పోరాటాలకు సిద్ధం కావాలని అన్నారు
ప్రధానంగా కేసముద్రం మండలానికి ఇబ్బందికరంగా మారినటువంటి లేబర్ ఆఫీస్ సమస్యను సంబంధిత అధికారులు పరిష్కరించాలని తగు చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో
హమాలీ యూనియన్ కేసముద్రం అధ్యక్షులు మిట్ట గడపల వెంకన్న, కార్యదర్శి బట్ట మేకల రాజు, కూలి యూనియన్ అధ్యక్షులు సకినాల ఐలయ్య, ఎడెల్లి శ్రీనివాస్, హమాలి కూలి, యూనియన్ నాయకులు గుగులోతు లాలు, మహంకాళి వెంకన్న, జీలకర్ర బాబు, భూక్య బిచ్చ, పయ్యావుల అనిల్, ఆంగోతు తార, తురక రాదమ్మ, సాంబలక్ష్మి, నాగులపాటి లలిత, జాటోత్ మంజుల, తార, కోడి సమ్మక్క, జి రజిత, లలిత, జిలకర బాబు,బడి శంకర్, యాకూబ్ పాష, సంజీవ, బాలు, కాసు సూరయ్య,మంజా,బొంపల్లి సరిత, లక్ష్మి, పద్మ, నాగు, చందన్, జోగేందర్, మహంకాళి కృష్ణ, తదితరులు పాల్గొన్నారు