పోడు భూముల గ్రామసభకు హాజరైన డిపిఓ

చిట్యాల,నవంబర్ 15 నిజం న్యూస్:
చిట్యాల మండలంలోని వెంచరామి శివారు కుర్మపల్లి గ్రామంలో మంగళవారం జరిగిన పోడు భూముల గ్రామ సభకు జిల్లా పంచాయతీ అధికారి ఆశాలత హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అందుకుతండ, కుర్మపల్లి గ్రామాలలో ఏర్పాటు చేసిన పోడు భూములకు సంబంధించిన తుది గ్రామసభలలో భాగంగా కుర్మపల్లి పోడులో 70 మంది ధరఖాస్తు చేసుకున్నారని వారి ధరఖాస్తులను ఫారెస్ట్ బీట్ అధికారులు పంచాయితీ కార్యదర్శులు కలిసిసర్వే చేశారని కుర్మపల్లిలో 24 మంది మాత్రమే కల్టివేషన్లో ఉన్నారని మిగితా 46 మంది కల్టివేషన్ లేరని ఆమె తెలిపారు. గ్రామసభ ద్వారా వారికీ తెలియపచడము జరిగిందన్నారు. ఇట్టి వివరములు రెవెన్యూ డివిజన్ అధికారికి పంపడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపిడిఓ రామయ్య, ఎంపిఓ రామకృష్ణ, ఎఫ్ఆర్సి చైర్మన్స్, సభ్యులు, సంబంధిత గ్రామాల సర్పంచులు, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ పురుషోత్తం, డిప్యూటీ ఆర్వో మోయిన్, పంచాయతీ కార్యదర్శులు, పోడు లబ్దిదారులు పాల్గొన్నారు. తదుపరి అందుకుతండా, చైన్ పాక గ్రామాల సిగ్రీగేషన్ షేడ్స్, వైకుంఠ దామాలను పరిశీలించారు.