జాతీయ స్థాయి చిత్రలేఖన పోటీలకు మునిగలవీడు పాఠశాల విద్యార్థి ఎంపిక

జాతీయ స్థాయి చిత్రలేఖన పోటీలకు మునిగలవీడు పాఠశాల విద్యార్థి ఎంపిక
హర్షం వ్యక్తం చేసిన సర్పంచ్ గ్రామస్తులు
నెల్లి కుదురు అక్టోబర్ 15నిజం న్యూస్
ఎన్ టి పి సి సంస్థ వారి అధ్వర్యంలో హైద్రాబాద్ లో నిర్వహించిన రాష్ట్ర స్థాయి పోటీలలో చిత్రలేఖనం(ఆర్ట్) విభాగంలో రాష్ట్ర స్థాయిలో ద్వితీయ స్థానం పొంది జ్ఞాపిక తో పాటు 30000 ప్రైజ్ మనీ నీ గెలుచుకొని డిసెంబర్ మాసంలో ఢిల్లీలో జరుగు జాతీయ స్థాయి పోటీలకు తెలంగాణ నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న మునిగలవీడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు చరణ్(రోహిత్) ను మరియు అదే పోటీలలో ఉత్తమ ప్రతభ కనబర్చి ప్రత్యేక బహుమతి కి ఎంపిక కాబడిన కృష్ణ వంశీ లను సత్కరించిన గ్రామ సర్పంచ్ నల్లాని నవీన్ రావు, ప్రధానోపాధ్యాయులు గంగాదర్ గారు, ఆర్ట్ టీచర్ రాజేష్ గారు,ఉపాధ్యాయిని ఉపాద్యాయ బృందం మరియు గ్రామస్తులు నల్లాని ప్రవీణ్ రావు…. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ రాష్ట్ర స్థాయి పోటీలలో విజయం సాధించడంతో పాటు జాతీయ స్థాయి పోటీలకు మన పాఠశాల విద్యార్థి ఎంపిక కావడం చాలా గర్వించదగిన విషయం అని రాష్ట్ర స్థాయి లో మన గ్రామానికి పేరు ప్రతిష్టలు తీసుకొచ్చిన విద్యార్థి కి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ జాతీయ స్థాయిలో కూడా విజయం సాధించే దిశగా కృషి చేయాలని కోరుకోవడం జరిగింది అలాగే ఈ విద్యార్థుల విజయానికి కృషి చేసిన ఆర్ట్ టీచర్ రాజేష్ గారిని ప్రత్యేకంగా అభినందించడం జరిగింది.