ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలి…. రైతు సంఘం డిమాండ్

నెల్లి కుదురు అక్టోబర్ 15నిజం న్యూస్
నెల్లికుదురు మండలంలోని మునగలవీడు గ్రామంలో రైతు సంఘం జెండా ఆవిష్కరణ మండల కార్యదర్శి భూక్యబిక్షపతి ఆవిష్కరించిన అనంతరం ఆయన మాట్లాడుతూ రైతుల పండించిన పంటకు గిట్టుబాటు దర కల్పించాలని కొనుగోలు కేంద్రం వెంటనే ప్రారంభించాలని. ధాన్యాన్ని మార్కెట్లో పొసి 20 రోజులు గడుస్తున్నా ఇప్పటివరకు ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభించలేదని రైతులకు మొదటగా వచ్చిన ధాన్యాన్ని వెంట వెంటనే కాఃటాలు పెడితే మిగతా వచ్చే రైతులకు కళ్ళం సరిపోతుందని అన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రానికి కాళీ బస్తాలను వెంటనే పంపాలని కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఈకార్యక్రమంలో సిపిఎం శాఖ కార్యదర్శి ఇస్సంపెల్లి సైదులు. నాయకులు బత్తెం సత్యనారాయణ.మచ్చ వెంకన్న. సాయిలు. రమేష్. యాకుబ్ తదితరులు పాల్గొన్నారు