అరుణోదయ సంస్కృతిక సమైక్య తెలంగాణ రాష్ట్ర ఆరో మహాసభను జయప్రదం చేయండి

అక్టోబర్ 19 20న జరుగు అరుణోదయ సంస్కృతిక సమైక్య తెలంగాణ రాష్ట్ర ఆరో మహాసభను జయప్రదం చేయండి.
అరుణోదయ అధ్యక్ష కార్యదర్శులు కుక్కముడి యాకన్న, చిట్టి మల్ల అశోక్
నెల్లి కుదురు అక్టోబర్ 15నిజం న్యూస్
మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని స్థానిక బట్టు అంజయ్య స్మారక భవనంలో అరుణోదయ రాష్ట్ర 6వ, మహాసభను జయప్రదం చేయాలని పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా అరుణోదయ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కుక్కముడి యాకన్న, చిట్టి మల్ల అశోక్ మాట్లాడుతూ…..
నక్సల్ బరీ, శ్రీకాకుళం, గోదావరిలో ప్రతిఘటనా సవ్వడుల స్వరాల నుండే అరుణోదయ సంస్థ ఆవిర్భవించింది. సుమారుగా అర్థశతాబ్దికాలంగా ఆడుతూ, పాడుతూ సంస్కృతి పోరాటాలు రాటు తేలింది అన్నారు. తెలంగాణ రైతాంగ సాయుధ సమరంలో బందుకు చేతబడిన బండి యాదగిరి, శ్రీకాకుళ పోరాటాల పాణిగ్రహిల పాట, ఆట మాటలే అరుణోదయ ప్రణాళిక. ప్రజా కాల కోసం తన జీవితాలను దారబోసిన కానూరి, రామారావుల నిబద్ధతే అరుణోదయ సంస్కృతిక ఉద్యమ, సాహిత్య పోరాటాల కళా ప్రదర్శన. నేడు భూస్వామ్య, సామ్రాజ్యవాదం, మతోన్మాదం, కులోన్మాదం కలగలిసి మనువాద ఆర్ఎస్ఎస్, విశ్వహిందూ పరిషత్, సంఘ్ పరివార దేశంలో ఫాసిస్టు పాలన కొనసాగుతుంది. ఒకే దేశం, ఒకే మతం, ఒకే భావం, ఓకే జాతి, ఒకే పార్టీ అంతిమంగా అఖండ భారత్ రావాలంటే ముస్లిం మైనార్టీలను తన్ని తరమేయాలంటుంది. విభేదించే విపక్షాలను ప్రశ్నించే మేధావులను గౌరిలంకేష్ లాగ చంపడమో, లేక ఆర్బన్ నక్సలైటు లాగా చిత్రీకరించి ఉపా క్రింద నిర్బంధించమో చేస్తుంది. ఇలాంటి నిర్బంధాలను ఖాతర్ చెయక ఖతర్నాక్ గా కదం తొక్కుదాం అన్నారు. మరోవైపు కోటి ఆశలతో, కోటి రతనాల వీణ నా తెలంగాణ నినాదంతో తెచ్చుకున్న నేటి తెలంగాణ రైతుల ఆత్మహత్యలు, నిరుద్యోగం, ఆదివాసుల ఆందోళనలలో అల్లకల్లోలంగా ఉంది అని అన్నారు. మునుగోడు ఎన్నికల మీద ఉన్న చిత్తశుద్ధి తెలంగాణ ప్రజల పైన లేకపోవడం సిగ్గుచేటని అన్నారు. ఈ అరుణోదయ రాష్ట్ర సంస్కృతిక సమైక్య తెలంగాణ 6వ, రాష్ట్ర మహాసభలను కవులు, కళాకారులు, మేధావులు విద్యార్థులు, విద్యావేత్తలు,, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని ఈ సభని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మంద పద్మక్క, దేవేందర్ పద్మ భూషణ్, కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు.