అంధకారమును తెంచే దీపాలు పుస్తకాలు

మునిసిపల్ కమిషనర్ పూజారి అవినాష్
జయశంకర్ భూపాలపల్లి జిల్లా నవంబర్ 15 నిజం న్యూస్
భూపాలపల్లి శాసనసభ్యులుగండ్ర వెంకట రమణారెడ్డి మరియు జయశంకర్ భూపాలపల్లి జిల్లా బి.ఆర్.ఎస్ అధ్యక్షురాలు ,వరంగల్ జడ్పీ చైర్పర్సన్ గండ్ర జ్యోతి మేడం ఆదేశానుసారం జి ఎం ఆర్ ఎం ట్రస్ట్ సహకారంతో జిల్లాలో జరుగుతున్న 55వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల రెండవ రోజు సందర్భంగా జిల్లా గ్రంథాలయ సంస్థ జయశంకర్ భూపాలపల్లి నందు పుస్తక ప్రదర్శన ఏర్పాటు చేయనైనది. ఈ కార్యక్రమము జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బుర్ర రమేష్ గౌడ్ అధ్యక్షతన ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మున్సిపల్ కమిషనర్ పూచారి అవినాష్, 24వ వార్డు కౌన్సిలర్ శిరుప అనిల్ పాల్గొని రిబ్బన్ కట్ చేశారు
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ విద్యార్థులు ప్రతిరోజు గ్రంథాలయాన్ని సందర్శించి పుస్తక పఠనం చేయాలని అన్నారు, పుస్తక పఠనం ద్వారా మనోవికాసం పెరుగుతుంది మనసులో ఉన్నటువంటి అంధకారం తొలగిపోయి విజ్ఞానం అనే తేజస్సు వస్తుందని తెలిపారు, అంధకారమును తెంచే దీపాలు పుస్తకాలని అన్నారు తరగతి పుస్తకాలే కాకుండా విజ్ఞానాన్ని పెంచే ఇతర పుస్తకాలు గ్రంథాలయంలో అందుబాటులో ఉంటాయి కావున గ్రంథాలయాన్ని సందర్శించి పుస్తక పఠనం చేస్తూ విజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని కమిషనర్ విద్యార్థులకు సూచించారు.
ఈ పుస్తక ప్రదర్శనలో స్థానిక శాసనసభ్యులు గండ్ర వెంకటరమణ రెడ్డి అందించిన జిఎంఆర్ఎం ట్రస్ట్ పుస్తకాలతో పాటు ఆధ్యాత్మిక, వ్యక్తిత్వ వికాసం, నిఘంటువులు, జీవిత చరిత్రలు, కథలు, నవలలు ,పోటీ పరీక్షలకు సంబంధించిన పుస్తకాలు ఇంకా వివిధ రకాల పుస్తకాలను ప్రదర్శించడం జరిగినది.
అనంతరం విద్యార్థులకు మ్యూజికల్ చైర్ పోటీ నిర్వహించనైనది.
ఈ గ్రంథాలయ వారోత్సవాలకు అన్ని సహాయ సహకారాలు అందిస్తున్న జీఎంఆర్ఎం ట్రస్ట్ జనరల్ సెక్రెటరీ గండ్ర గౌతంరెడ్డి కి గ్రంథాలయ చైర్మన్ బుర్ర రమేష్ కృతజ్ఞతలు తెలియజేసినారు.
ఈ కార్యక్రమంలో మైనారిటీ కాలేజ్ ప్రిన్సిపాల్ టి. వెంకటేశ్వర్ గౌడ్ లెక్చలర్ సుధాకర్ శేఖర్ రవి,గ్రంథాలయ సిబ్బంది టీ .చంద్రమౌళి ,ఈ. శారద జి.శ్రీనివాస్, టీ. ప్రభాకర్ , శ్రీనివాస్ , రాకేష్ తదితరులు పాల్గొన్నారు