మహిళా జర్నలిస్ట్ కుమారిని పరామర్శించిన ఇల్లందు ప్రెస్ క్లబ్ సభ్యులు

ఇల్లందు,నవంబర్15( నిజం న్యూస్):అనారోగ్యంతో బాధపడుతున్న మెట్రో ఈవినింగ్ అర్బన్ రిపోర్టర్ దొడ్డిగార్ల కుమారిని మంగళవారం ఇల్లందు ప్రెస్ క్లబ్ సభ్యులు పరామర్శించి కుటుంబ సభ్యులను అదైర్య పడవద్దని అండగా ఉంటామని వారికి భరోసానిచ్చారు.అనంతరం ఆర్థిక సహాయం అందించి దాతృత్వాన్ని చాటుకున్నారు.అదేవిధంగా మెట్రో ఈవినింగ్ రూరల్ రిపోర్టర్ రజినీకాంత్ తన తనవంతుగా ఆర్థిక సాయం అందజేశారు.ఈ కార్యక్రమంలో ఇల్లందు ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు గుర్రం రాజేష్,ఉపాధ్యక్షులు రాజేష్,కోశాధికారి మధు,సహాయ కార్యదర్శి నందు,మహిళా జర్నలిస్ట్ జహారాభి,సభ్యులు చారి,భాస్కర్,సురేందర్ బాబు,సలీం,నటరాజ్,రవి,శివ,విజ్ఞాన్ తదితరులు పాల్గొన్నారు.