సబ్ ఇన్స్పెక్టర్ కావాల్సిన యువకుడు, గుండెపోటుతో అకస్మాత్తుగా మృతి

సూర్యపేట జిల్లా కేంద్రంలో కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
మృతుని కుటుంబాన్ని అన్ని విధాల ప్రభుత్వం ఆదుకోవాలని కుటుంబ సభ్యుల వేడుకోలు.
సూర్యాపేట ప్రతినిధి నవంబర్ 15 నిజం న్యూస్
సూర్యపేట జిల్లా ఇందిరమ్మ కాలనీ కి చెందిన సమర్తపు లక్ష్మయ్య కుమారుడు శ్రీకాంత్, ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన సబ్ ఇన్స్పెక్టర్ ప్రిలిమినరీ పరీక్షలో అర్హత సాధించాడు….తదుపరి నిర్వహించే శారీరక,దేహదారుడ్య పరీక్షల కోసం జిల్లా కేంద్రం లోని శ్రీ వెంకటేశ్వర డిగ్రీ కళాశాలలో ప్రతి రోజు ఉదయం ప్రాక్టీస్ చేస్తున్నాడు….రోజు లాగే మంగళవారం ఉదయం కూడా వాకింగ్ చేస్తుండగా ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు….హుటాహుటిన మిత్రులు సూర్యపేట జిల్లా ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లుగా వైద్యులు తెలిపారు…చేతికందిన కుమారుడు,త్వరలో ఎస్ ఐ గా ఉద్యోగం సంపాదిస్తాడు అనుకున్న కుమారుడు అకాల మరణం చెందడంతో ఆ తల్లి దండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఏది ఏమైనా జగన్నాధ నాటకంలో, కేవలం మనం పాత్రులు మాత్రమే…