ఎస్ కె ఎస్.చారిటి. ఆధ్వర్యంలో పేద విద్యార్థులకు ఆర్థిక సహాయం

చర్ల నవంబర్ 14 (నిజం న్యూస్) ఎస్ కే ఎస్ చారిటీ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు ఎస్కే షాజహాన్ ఆధ్వర్యంలో పేద విద్యార్థులు.9 మంది. 10వ తరగతి మెరిట్ ప్రధమ ద్వితీయ తృతీయ విద్యార్థి నీ విద్యార్థులకు. ఎంబీబీఎస్ లో సీటు సాధించిన కొత్తపల్లి గ్రామానికి చెందిన గుంటుపల్లి సాయిరాం. ఎర్రం నాగశ్రీలకు. ఆర్థిక సహాయంగా తన వంతు 1.20. లక్షల రూపాయలను సోమవారం అందజేశారు.
ఈ సందర్భంగా ముఖ్యఅతిథిగా హాజరై తాసిల్దార్ బి భరణి బాబు మాట్లాడుతూ విద్యార్థులు చదువుల్లో ఉత్తీర్ణత సాధించి ఉన్నత స్థాయికి ఎదగాలని తల్లిదండ్రులకు ఉపాధ్యాయులకు మండలానికి మంచి పేరు ప్రతిష్టలు తేవాలని సూచించారు. విద్యార్థులకు చదువు నిమిత్తం అవసరమైన సర్టిఫికెట్లను రెండు మూడు రోజుల్లో ఎంక్వరీ చేసి ఇచ్చేందుకు నా వంతుకృషి చేస్తానని అన్నారు విద్యార్థులకు ఆర్థిక సహాయం అందించిన చా
రిటీ కుటుంబ సభ్యులకు అభినందనలు తెలిపారు. చారిటీ ఆధ్వర్యంలో తాసిల్దార్ కు శాలువాతో ఘన సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో రాహుల్ విజ్ఞాన్ ప్రధానోపాధ్యాయులు వర్మ. గురుదేవ్ విద్యాలయం ప్రధానోపాధ్యాయులు సిహెచ్ వి గిరి. కళా రవళి అధ్యక్ష కార్యదర్శులు. నీలి నందు తడికల లాలయ్య. ఉపాధ్యాయులు. రిటైర్డ్ ఉపాధ్యాయులు దొడ్డి తాతారావు. మామిడి రామచంద్రరావు చిట్టిబోతుల వేణు. నీలి ప్రసాద్ ఎడారి గణపతి పున్నం రామకృష్ణ. విద్యార్థుల తల్లిదండ్రులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు