అభివృద్ధి చేసి రుణం తీర్చుకుంటా

ఎన్ని కుట్రలు చేసినా విజయం మాదే.
నువ్వా,నేనా తేల్చుకుందాం..రా..
ఢిల్లీ ఐనా, గల్లీ ఐనా సిద్ధమే.
మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి.
చండూర్( నిజం న్యూస్):మునుగోడు నియోజకవర్గాన్ని కనివిని ఎరుగని రీతిలో అభివృధ్ధి చేసి ప్రజల రుణం తీర్చుకుంటానని మునుగోడు తాజా ఎమ్మెల్యే కుసూకుంట్ల ప్రభాకర్ రెడ్డి హామీ ఇచ్చారు.సోమవారం చండూర్ మున్సిపల్ కేంద్రంలో విజయోత్సవ ర్యాలీ ముగింపు సమావేశంలో ఆయన మాట్లాడారు.రాబోయే రోజుల్లో నియోజకవర్గంలోని చండూర్,చౌటుప్పల్ మున్సిపాలిటీల రూపు రేఖలు మారిపోతాయన్నారు.అదేవిధంగా అన్నీమండలల్లో గతంలో ఆగిపోయిన అభివృద్ధి పనులను పూర్తిచేస్థామన్నారు.ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తామన్నారు.టిఆరస్ ను ఓడించాలని బీజేపీ ప్రభుత్వం ఎన్నికల సంఘంతో కలిసి ఎన్ని కుట్రలు చేసిన ప్రజలు టి ఆర్ ఎస్ కే పట్టం కట్టారన్నారు.ప్రజలు అడుగడుగునా ఘనంగా స్వాగతం పలుకుతుంటే చూసి ఓర్వలేక మునుగొడులో కార్యకర్తల మధ్య గొడవలు పెట్టటానికి రాజగోపాల్ రెడ్డి ప్రయత్నించాడన్నారు.గోడవలతో అభివృద్ధిని ఆడ్డుకోవలని చూస్తే ఉరుకోబోమని హెచ్చరించారు.అభివృద్ధి కోసమే సహనంగా వుంటున్నామని అన్నారు.అన్ని పార్టీల కార్యకర్తలు గొడవలు పడకుండా కలిసిమెలిసి ఉండాలని సూచించారు.రాజగోపాల్ రెడ్డి కార్యకర్తల మధ్య గొడవలు పెట్టి రాక్షసఆనందం పొందుతున్నడన్నారు.దమ్ముంటే రా…నువ్వో,నేనో తేల్చుకుందాం కుస్తీకైనా,కబడ్డీ కైనా,అది గల్లీ అయినా ఢిల్లీ అయినా దేనికైనా సిద్ధమే అని సవాల్ విసిరారు.అంబేద్కర్ స్ఫూర్తిగా ఈ ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తానన్నారు.రేపు వివిధ శాఖల మంత్రులు,అధికారులతో జరిగే సమీక్ష సమావేశం అనంతరం పనులు ప్రారంభిస్తామన్నారు.ఈ సమావేశంలో మున్సిపల్ చైర్మన్ తోకల చంద్రకళ వెంకన్న,జడ్పిటిసి కర్నాటి వెంకటేశం, ఎంపిపి పల్లె కల్యాణి రవికుమార్ ,కౌన్సిలర్ కోడి వెంకన్న,నాయకులు బొల్లా శివశంకర్,బోమ్మరబోయిన వెంకన్న ,బుతరాజుదశరథ తదితరులు పాల్గొన్నారు.