అత్యాచారయత్నానికి గురైన మైనర్ బాలిక మృతి

అత్యాచారయత్నానికి గురైన మైనర్ బాలిక మృతి

నాగారం నవంబర్ 14 నిజం న్యూస్

ఒక కామంధుడి కామoతో మైనర్ బాలిక అత్యాచార యత్నానికి గురై 39 రోజులు మృత్యుతో పోరాడి మృతి చెందిన సంఘటన మున్సిపాలిటీ కేంద్రంలోసోమవారం జరిగింది. సంఘటన సంబంధించిన వివరాలు తిరుమలగిరి మున్సిపాలిటీ 3 వార్డు లో అడప్ప కావేరి పాఠశాల లో తాత్కాలిక చిరు ఉద్యోగిగా పనిచేస్తూ భర్త చనిపోయిన తనకున్న ఇద్దరు పిల్లలతో జీవనం సాగిస్తోంది.9 వ తరగతి చదువుతున్న మైనర్ బాలిక ను దసరా పండుగ రోజున ఇంటి చాకలి అయిన నిందితుడు అమనగంటి రాజు అమ్మకు భోజనం పెట్టడానికి పిలవడానికి బాలికను పంపించింది. ఆ సమయలో నింధితుని ఇంట్లో ఎవరూ లేకపోవడoతో ఇదే అదునుగా భావిచిన అమనగంటి రాజు మైనర్ బాలికను ఇంటి లోపలికి తీసుకెళ్ళి అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు.పిలవడానికి వెళ్లిన మైనర్ బాలిక ఎంత సేపటికీ రాకపోవడం తో బాలిక తల్లి వెళ్లి పిలువగా పిలుపు విన్న నిందితుడు బాలికను వదిలి పెట్టాడు. బాలిక ఏడుస్తూ పెడబొబ్బల తో బయటకు పరిగెత్తుకుని వచ్చి తల్లిని హత్తుకుoది.లోపల ఏం జరిగిందో చెప్పలేని స్థితిలో షాక్ గురైంది.ఈ విషయం చెప్పవద్దని నింధితుని తల్లిదండ్రులు బాలిక తల్లి కాళ్లవేల్ల పడ్డారు.బాలిక మొదటి వారం రోజులు ఎవరి తో సరిగా మాట్లాడక పోవడo జరిగింది. తరువాతి రోజులలో ఎడమ చేయి కాలు కాస్త వంకర తిరగడం తో వెంటనే హాస్పటల్ లో చేర్చారు. ఆ రోజు నుండి చికిత్స పొందుతూ గత వారం రోజుల క్రిందట అపస్మారకస్థితిలోకి లోకి వెళ్లి సోమవారం ఉదయం మరణించింది.బాలిక మరణం తో తిరుమలగిరి మున్సిపాలిటీ కేంద్రంలో విషాదం ఛాయలు అలుముకున్నాయి.బాలిక కుటుంబ సభ్యుల పిర్యాదు మేరకు నిందితుడు రాజును అదుపులోకి తీసుకొని దర్యాప్తు చేస్తున్నామని ఎస్.ఐ. శివ కుమార్ తెలిపారు.