అంబరాని అంటిన పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

కార్యనిర్వాహక సభ్యులు ఆకుల సురేష్
మహాదేవపూర్ నవంబర్ 13 (నిజం న్యూస్)
అంబరాని అంటిన సంబరాలు ఒక్కసారిగా ఊరు ఊరంతా పండుగ వాతావరణం లా ఏర్పాటు అయింది
1970-2000 సంవత్సరాల క్రితం చదువు కున్న విద్యార్థుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు జయశంకర్ జిల్లా భూపాలపల్లి మహాదేవపూర్ మండలం సూరారం గ్రామంలోని ఉన్నత పాఠశాలలో ఆదివారం రోజున జరిగిన ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమాన్ని కి ముఖ్య అధితులుగా ఆకుల సురేష్ మరియు మురికి సత్యనారాయణ హజరై మాట్లాడుతూ 3000 మంది విద్యార్థులను ఒక్క తాటిపైకి తీసుకోని వచ్చి ఆట పాటలతో పాత రోజులను గుర్తుచేసు కుంటూ సుమారు 20 మంది గురువులను ఊరేగింపు గా స్వాగతం పలికి, స్కూలుకు ర్యాలి గా తరలి వచ్చి వారిని ఘనంగా సన్మానించారు అనంతరం వివిధ రంగాల్లో స్థిరపడిన పూర్వ విద్యార్థుల వారి వారి అలనాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ మళ్ళీపాత రోజులను నెమరు వేసుకున్నారు అదేవిధంగా కార్యక్రమంలో పాల్గొన్నవారు సూరారం ఇంచార్జీ సర్పంచ్ చల్ల రమేష్ రెడ్డి టిఆర్ఎస్ పార్టీ నాయకులు నాగుల లక్ష్మారెడ్డి కాంగ్రెస్ పార్టీ నాయకులు మడ్క ప్రతాప్ రెడ్డి చల్ల మోహన్ రెడ్డి బండి శ్రీనివాస్ చల్ల రాజేందర్ చీర్ల తిరుపతి మేర రమేష్ మరియు తదితరులు ఉన్నారు అదేవిధంగా సాయంత్రం 6.గంటలకు చమ్మక్ చంద్ర ఆనంద లహరి కార్యక్రమము జరుగుతుంది అని తెలిపారు