సూర్యాపేటలో శ్రీనిధి నర్సింగ్ హోం సీజ్

ఆడపిల్ల పుట్టకుండా ఆసుపత్రిలో అబార్షన్ చేయడానికి ప్రయత్నం.
డిఎంహెచ్ వో డాక్టర్ కోట చలం.
సూర్యాపేట ప్రతినిధి నవంబర్ 12 నిజం న్యూస్
ఆడపిల్ల పుట్టకుండా ఆసుపత్రిలో అబార్షన్ చేయడానికి ప్రయత్నం చేసినట్లు సమాచారం అందడంతో శనివారం హుటాహుటిన నర్సింగ్ హోం కు చేరుకుని అబార్షన్ కోసం తీసుకుని వఛ్చిన మహిళను, ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి కి తరలించిన జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డిఎంహెచ్వో కూడా చలం.
*ఆసుపత్రి యాజమాన్యం పై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పిన డిఎంహెచ్ వో
ఆడపిల్లల జననాలు అడ్డుకుంటున్న స్కానింగ్ సెంటర్ లు, ప్రైవేటు ఆసుపత్రులపై మరిన్ని దాడులు చేయాలని కోరుతున్న ప్రజలు.
వైద్య ఆరోగ్య శాఖ కు అభినందనలు తెలుపుతున్న మహిళా లోకం. ఈ కార్యక్రమంలో జిల్లా ఇన్నైజేషన్ అధికారి డాక్టర్ వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.