పట్టాలు ఇచ్చారు ప్లాట్స్ మరిచిపోయారు

ఉమ్మడి ఆదిలాబాద్ బ్యూరో నిర్మల్ జిల్లా నవంబర్ 10 (నిజం న్యూస్)
నిర్మల్ జిల్లా బైంసా డివిజన్ గల118 సర్వే భూమి లో గల 60 మంది లబ్ది దారులకు ప్లాట్స్ ఇవ్వాలని కోరుతూ రాజస్వా మండల అధికారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది..
ఈ సందర్భంగా జన సేన పార్టీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఉపాధ్యక్షులు సుంకెట మహేష్ బాబు మాట్లాడుతూ..
పట్టాలు ఇచ్చి ప్లాట్స్ ఇప్పటి వరకు ఇవ్వక పోవడం చాలా దారుణం గత పది సంవత్సరాలుగా పేదలకు పంపిణీ చేయవలసిన ప్లాట్స్ ఇవ్వకపోవడం వల్ల వాళ్ళు కిరాయి ఇండ్లలో జీవనం సాగిస్తున్నారు.వేళల్లో కిరాయిలు కట్టలేక వారి బతుకులు అగమ్య గోచరంగా మారాయి.అసలే నిరుపేద కుటుంబాలు రెక్కాడితే గాని డొక్కాడని ఆర్థిక పరిస్థితుల్లో విలవిల్లాడుతున్నారు.అధికారుల,చుట్టు ప్రజా ప్రతినిదుల చుట్టు తిరిగి తిరిగి అనేక రూపాల్లో వినతులు ఇచ్చిన ఎవరు పట్టించు కోవడం లేదు ఈ సమస్యను ప్రభుత్వం వెంటనే చొరవ తీసుకుని బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నాం.లేని యెడల రెండు రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళనలు చేయడానికి సిద్ధం గా వున్నామని హెచ్చరిస్తున్నాం. ఈ కార్యక్రమంలో రాణీ,కమల,గౌరీ,ముత్యం,గణేష్,తదితరులు పాల్గొన్నారు.