తల్లిని పట్టించుకోని కుమారులు

యాదాద్రి భువనగిరి జిల్లా బ్యూరో నవంబర్10(నిజం న్యూస్)
నవమాసాలు మోసి .. రక్తం పంచి జన్మనిచ్చిన తల్లిని వృద్ధాప్యంలో పట్టించుకోని కుమారులు.సాధారణంగా తల్లిదండ్రులు బిడ్డల బాగోగుల కోసం నిత్యం శ్రమిస్తారు.తాము పస్తులుండి మరి పిల్లల కడుపు నింపుతారు.వారికి చిన్న ఆపద వస్తే విలవిల్లాడతారు. బిడ్డలకు మంచి జీవితం ఇవ్వడం కోసం తమ జీవితాలను త్యాగం చేస్తారు.ఇంత చేసి బిడ్డలను జీవితంలో స్థిరపడేలా చేసిన తల్లిదండ్రులకు చివరకు కనీసం పట్టెడన్నం పెట్టడానికి కూడ వెనకాడుతున్నారు కొందరు. తల్లిదండ్రులు తమ కోసం చేసిన త్యాగాలను మర్చిపోయి.. వారిని దిక్కులేని వారిగా చేస్తున్నారు. జీవితాంతం కష్టపడి బిడ్డలను ప్రయోజకులను చేసి వారు జీవితంలో స్థిరపడితే ఇక చివరి దశలో మనవలు, మనవరాళ్లు, పిల్లలతో కలిసి సంతోషంగా ఉండాలని భావిస్తారు. కానీ చాలామంది తల్లిదండ్రుల విషయంలో ఇది అత్యాశే అవుతుంది. తమ కోసం జీవితాన్ని ధారపోసిన తల్లిదండ్రులను వృద్ధాప్య దశలో బాగా చూసుకోవాల్సింది పోయి అనాథలను చేస్తున్నారు తాజాగా యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలం మైలారం గ్రామానికి చెందిన బండ మల్లమ్మ తన కుమారులు వృద్ధాప్యంలో ఉన్న ఆమెను పట్టించుకోవటం లేదని యాదాద్రి భువనగిరి కలెక్టరేట్ లో అడిషనల్ కలెక్టర్ నీ కలిసి ఆమె సమస్యను తెలిపారు.ఆమెకి నలుగురు కుమారులు కాగా పెద్దకొడుకు మరణించాడు.వృద్ధాప్యంలో ఉన్న మల్లమ్మను మనవడు ఒక సంవత్సరం పాటు చూసుకున్నాడని. మిగతా ముగ్గురు కుమారులు చూసుకోవడం లేదని తెలియజేశారు.మల్లమ్మ అందరికీ ఆస్తులు సమానంగా ఇవ్వడంతో ప్రస్తుతం మల్లమ్మ దగ్గర ఆస్తి లేదని ఆమెని పట్టించుకోవడంలేదని తెలిపింది. అందుకని తనని వృద్ధాశ్రమంలోనైనా చేర్పించాలని అధికారులకు విన్నవించుకుంది