చర్ల పోలీసుల ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం

చర్ల మండలం కుర్నపల్లి గ్రామంలో చర్ల పోలీసుల ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం
500 కుటుంబాలకు ఉచితంగా వైద్య పరీక్షలు,మందుల పంపిణీ
* ఏజెన్సీ ప్రాంత ప్రజల సమస్యలను తీర్చడమే పోలీసుల ప్రధాన లక్ష్యం : ఎస్పీ డా.వినీత్.
చర్ల నవంబర్ 10 (నిజాం న్యూస్)
*ఇటీవల మావోయిస్టుల చేతిలో హత్యకు గురైన కుర్నపల్లి ఉప సర్పంచ్ ఇర్పా రాముడు కుటుంబాన్ని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ ఓ ఎస్ డి .అడిషనల్ ఎస్పీ పి. ఆపరేషన్ టి సాయి మనోహర్. ఏ ఎస్ పి రోహిత్ రాజ్ గురువారంపరామర్శించారు అనంతరం
కుర్నపల్లి గ్రామంలోని ప్రాథమికోన్నత పాఠశాలలో సుమారుగా 500 కుటుంబాలకు ఉచిత మెగా వైద్య శిబిరాన్ని చర్ల పోలీసులు ఏర్పాటు చేయడం జరిగింది.కుర్నపల్లి,ఎర్రబోరు, బోదనెల్లి,రామచంద్రపురం,బత్తినపల్లి,కొండవాయి గ్రామాలకు చెందిన 500ల కుటుంబాలు ఈ వైద్య శిబిరంలో పాల్గొన్నారు విభాగాలలో నిపుణులైన వైద్యుల బృందం సహాయంతో వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులను పంపిణీ చేశారు.