హట్ టాపిక్ గా మారిన తుమ్మల పొలిటికల్ ఎంట్రీ

తుమ్మల అభిమానుల ఆత్మీయ సమ్మేళనం
చర్ల నవంబర్ 10 (నిజాం న్యూస్) మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆత్మీయ సమ్మేళనం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది ములుగు జిల్లా వాజేడు మండలం లో తుమ్మల అభిమానుల ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా గురువారం ఉదయం భద్రాచలం లోని రామయ్య ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం తుమ్మల సుమారు 300 కార్లతో ర్యాలీగా వాజేడు బయలుదేరారు ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా తుమ్మల అనుచరులు ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు. తుమ్మల పార్టీ మార్పుపై జోరుగా ఊహగానలు చెక్కర్లు కొడుతున్నాయి మరోవైపు తుమ్మల ఆత్మీయ సమ్మేళన పై ఇంటిలిజెంట్ వర్గాలు నిగా పెట్టినట్లు సమాచారం కొంతకాలం నుంచి తుమ్మల నాగేశ్వరరావు టిఆర్ఎస్ లో పొలిటికల్ ఎలాంటి కార్యక్రమాలలో పాల్గొనడం లేదు దీంతో ఆయన పార్టీ మారుతున్నారనే అనుమానాలు చెక్కర్లు కొడుతున్నాయి ఇదిలా ఉండగా ఇటీవలన కాలంలో తుమ్మల కాంగ్రెస్ బిజెపి కీలక నేతలతో టచ్ లో ఉన్నాడని వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి ఈ వార్తలను ఒకానొక సమయంలో తుమ్మల వాటిని కొట్టి పారేశారు ఈ క్రమంలో తుమ్మల ఆత్మీయుల సమ్మేళన అనుకోకుండా చేపట్టడం పై హాట్ టాపిక్ గా మారింది