యాదాద్రిలో ప్రేమ జంట ఆత్మహత్య

యాదాద్రి భువనగిరి జిల్లా బ్యూరో నవంబర్ 09(నిజం న్యూస్)
యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం బాహుపేట గ్రామంలో విషాదం నెలకొంది. రైలు కిందపడి ప్రేమ జంట ఆత్మహత్య చేసుకుంది. మృతులు భువనగిరి మండలం బస్వాపురం గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు.అమ్మాయికి ఇటీవలే వివాహం జరిగినట్లు తెలిసింది..రెండు రోజుల క్రితం యాదగిరిగుట్ట పిఎస్ లో మిస్సింగ్ కేసు నమోదయింది.