Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

నెరేడుచెర్ల రాఘవేంద్ర రైస్ మిల్లు వేబిడ్జిలో మోసం

ఒక్కొక్క ట్రాక్టర్కు 10 క్వింటాలు తక్కువ.
న్యాయం చేయాలని మిల్లు ముందు రైతుల ధర్నా.
12 బస్తాల ధాన్యం తక్కువ.
నెరేడుచెర్ల నవంబర్8 నిజం న్యూస్: నేరేడుచర్ల మున్సిపాలిటీ పరిధిలోని రాఘవేంద్ర ఫార్వార్డ్ మిల్లులోని వే బ్రిడ్జి తూకాల్లో మోసం చేస్తూ రైతులను దోచుకుంటున్నారు. ఆరు కాలం కష్టపడి పండించిన పంటను అమ్ముకోవడానికి రైస్ మిల్లు కు వస్తే వాళ్లు వే బ్రిడ్జ్ తూకాల్లో రైతులను మోసం చేస్తున్నారు. మంగళవారం రాత్రి ఆ మిల్లు ఎదుట ఏం చేయాలని ధర్నా చేశారు. నేరేడుచర్ల పట్టణంలోని జాన్పాడ్ రోడ్ లోని రాఘవేంద్ర రైస్ మిల్లు కు పాలకీడు మండలంలోని ముసివడ్డు సింగారo గ్రామానికి చెందిన రైతులు తాము పండించిన వరి పంటను కోత మిషన్ల ద్వారా కోయించి ధాన్యము ట్రాక్టర్లో రైస్ మిల్కు తీసుకువచ్చారు. మిల్లుకు సంబంధించి వే బ్రిడ్జి కాంటాలో కాంటా పెట్టించగా ఒక్కొక్క ట్రాక్టర్ కు సుమారు 12 బస్తాల ధాన్యం తక్కువగా వచ్చింది. మూడు ఎకరాల వరి పొలం సాగు చేసి సుమారు 90 బస్తాలు ధాన్యమును టాక్టర్ లో పోసి తీసుకువస్తే అది టన్నుల తూకం రావాల్సి ఉండగా 9 క్వింటాల్ చూపిస్తుందని అనుమానం వచ్చి రైతులు ఎదురుగా ఉన్న మరో వే బ్రిడ్జిలో కాంటా పెట్టించారు. దానిలో 10,300 కేజీల తూకం వచ్చింది. 21 500 ఒక్కొక్క ట్రాక్టర్ కు రైతులు నష్టపోవాల్సి వచ్చేది. అది గమనించిన రైతులు ధాన్యం అన్లోడ్ చేశామని మాకు న్యాయం చేయాలంటూ ఆందోళన చేపట్టిన రైతులు నెరేడుచెర్ల- జానపాడు రోడ్డుపై రాస్తారోకో చేపట్టారు. విషయం తెలుసుకున్న నెరేడుచెర్లఎస్ఐ నవీన్ కుమార్ సంఘటన స్థలానికి చేరుకొని వే బ్రిడ్జి పరిశీలించారు. రైతుల ఎదుటే మిల్లులో కాంటా పెట్టిన 10 ధాన్యం ట్రాక్టర్లను తిరిగి కాంటా పెట్టించగా రైతులు చెప్పిన విధంగానే తక్కువ తూకం వచ్చింది. న్యాయం చేయాలని రైతులు ఆందోళన చేపట్టడంతో పరిస్థితి ఉధృతంగా అయింది. విషయం తెలుసుకున్న హుజూర్నగర్ సిఐ రామలింగారెడ్డి సంఘటన స్థలానికి చేరుకొని వే బ్రిడ్జి పరిశీలించారు. కాంటా మిషన్ రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. వే బ్రిడ్జి యజమాన్యంపై చర్యలు తీసుకోవడంతో పాటు రైతులకు న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. రైతులు తప్పనిసరిగా రెండు కాంటాల మీద ఖచ్చితంగా తూకం వేయించుకోవాలని సూచించారు. రైతులను మోసం చేస్తే వారిపై చర్యలు తప్పవని సిఐ రామలింగారెడ్డి హెచ్చరించారు.