సార్…… గిరిజన బిడ్డలను….. ఆదుకోరా??

తండ్రి బాలాజీ నాయక్ మృతితో ఆగిపోనున్న గిరిజన బిడ్డల చదువులు, సాయం కోసం ఎదురుచూపులు.
విద్యుత్ శాఖ మంత్రి గుంత కండ్ల . జగదీష్ రెడ్డి ఆదుకోవాలని, కుటుంబ సభ్యులు వేడుకోలు.
సూర్యాపేట ప్రతినిధి నవంబర్ 8 నిజం న్యూస్
పిల్లల కోరిక మేరకు విద్యాభ్యాసంలో చేరిన గిరిజన బిడ్డలు, అనుకోకుండా తండ్రి మృతితో ఆర్థిక ఇబ్బందుల వల్ల చదువు మధ్యలో ఆగిపోతుందని ఓ గిరిజన కుటుంబం ఆవేదన వ్యక్తం చేస్తుంది..
. వివరాల ప్రకారం, సూర్యాపేట జిల్లా కేంద్రం వినాయక నగర్‌కు చెందిన మాండన్ బాలాజీ నాయక్ కి ఎలాంటి భూమి లేదు. రియల్ ఎస్టేట్ రంగంలో చిరు వ్యాపారం చేస్తూ కుటుంబాన్ని సాకుతున్నాడు. భార్య నాగమణి కుటీరంలో టైలరింగ్‌లో చేస్తూ, భర్తకు చేదోడువాదోడుగా ఉంటుంది. వీరికి ఇద్దరు కుమార్తెలు. మొదటి కుమార్తె ఉదయశ్రీ జైపూర్‌లో అగ్రికల్చర్ బీఎస్‌సీ పూర్తి చేసి పీజీ ఎంట్రన్స్ రాసింది. రెండవ కుమార్తె రేణుక పాండిచ్చేరి యూనివర్సిటీలో బీటెక్ సీఎస్‌సీ మొదటి సంవత్సరంలో జాయిన్ అయింది. ఇంకా మూడు సంవత్సరాలు చదవాల్సి ఉంది. మొదటి సంవత్సరం ఫీజు రూ.2.5 లక్షలు కాగా రూ. 1 లక్ష మాత్రమే చెల్లించారు. ఈ నేపథ్యంలో బాలాజీ నాయక్ అనారోగ్యంతో నిమ్స్‌లో చికిత్స పొందుతూ ఇటీవల మృతి చెందాడు.
. పెద్ద దిక్కు కోల్పోవడంతో దిక్కు తోచని స్థితిలో కుటుంబం కొట్టుమిట్టాడుతుంది. పీజీలో సీటు వస్తే పెద్ద కుమార్తెకు రెండు సంవత్సరాలు విద్యనభ్యసించాల్సి ఉంది. చిన్న కుమార్తె చదువు పూర్తి అయ్యేందుకు సుమారు రూ. 10 లక్షల వరకు అవసరం ఉంటుందన్నారు. రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి, పేదల పెన్నిధి, ఆపద్బాంధవుడు, గుంత కండ్ల జగదీష్ రెడ్డి పెద్ద మనసుతో గిరిజన కుటుంబాన్ని దత్తత తీసుకొని, గిరిజన బిడ్డలకు అండగా ఉండాలని గిరిజన కుటుంబం కోరుతున్నది. ఇంకా ఎవరైనా దాతలు ముందుకు వచ్చి, సహకరించి తమ విద్యార్థుల భవిష్యత్‌కు అండగా నిలవాలని దీన స్థితిలో ఉన్న ఆ కుటుంబం వేడుకుంటుంది. సహాయం చేయదలచిన వారు 9704863499 నంబర్‌ను సంప్రదించాలని కోరారు.