మేళ్లచెరువు లో మొసలి కలకలం

నిజం( న్యూస్ )మేళ్లచెరువు,
మేళ్లచెరువు మండలంలోని ఎర్రగట్టు తాండ గ్రామపంచాయతీ పరిధిలో మేళ్లచెరువు గ్రామానికి చెందిన కందుల శేషగిరి,బొగ్గవరపు సీతయ్య పొలంలో గల బావి లో మొసలి కనిపించినట్టు అట్టి ముసలి గత నాలుగు రోజులుగా తమ పొలంలో సంచరిస్తుందని మొదటి దాన్ని గుర్తించలేదని సోమవారం పొలానికి వెళ్ళగా బావిలో కనిపించడంతో ఇట్టి విషయం అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించడం జరిగిందని రైతులు తెలియపరిచారు. అటవీ శాఖ అధికారులు ఆదేశాల మేరకు స్థానిక అటవీ శాఖ కానిస్టేబుల్ వినోద్ బావి యొక్క పరిసరాలను పరిశీలించి అటవీశాఖ అధికారులకు తెలియజేయడంతో వారి సూచనల మేరకు బావిలో నీటిని తొలగించే ఏర్పాటు చేస్తున్నట్లు నీరు తొలగించిన వెంటనే మొసలిని పట్టుకుని ఏర్పాటు చేస్తామని కానిస్టేబుల్ వినోద్ తెలిపారు