శివాలయాలకు కార్తీక శోభ

– కార్తీక పౌర్ణమి సందర్బంగా ఆలయాల్లో పోటెత్తిన భక్తులు…….
యాదాద్రి భువనగిరి జిల్లా బ్యూరో 07(నిజం న్యూస్)
కార్తీకమాసోత్సవాల్లో భాగంగా సోమవారం రోజున శివాలయాలన్నీ కార్తీక శోభను సంతరించుకున్నాయి.ఈ సందర్భంగా తెల్లవారు జాము నుంచి శివాలయాలు భక్తులతో పోటెత్తాయి.శివాలయాల్లో మహిళలు కార్తీక దీపాలు వెలిగించారు.మహిళలు తలస్నానాలు చేసి సూర్యోదయానికి ముందు, సూర్యోదయానంతరం సమీప శివాలయాల్లో దీపాలను వెలిగించారు.ఈ సందర్భంగా భక్తులు తాము కోరిన కోరికలు తీరాలని,దీపంలా తమ కుటుంబం వెలిగేలా కాపాడమని,జీవితంలో వెలుగులు చిమ్మాలనీ మొక్కుకున్నారు.ప్రధానంగా అన్ని శివాలయాల్లో ప్రత్యేకంగా శివపూజలు నిర్వహించారు.తెల్లవారుజామునవేళల్లో భక్తుల రద్దీ కన్పించింది. కార్తీక పౌర్ణమి పురస్కరించుకుని జిల్లాలో అన్ని శివాలయాల్లో కూడా మహిళలు పిల్లలతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు.అలాగే ఆలయాల్లో ప్రధాన అర్చకులు తెల్లవారు జామునే శివునికి ప్రత్యేక అలంకరణ చేసి అభిషేకాలు,పలు రకాల
పూజలు చేపట్టారు.ఆలేరు మండలం కొలనుపాక గ్రామంలో సోమరేశ్వరస్వామి ఆలయంలో ఉదయం నుంచి ఆలయాల్లో అభిషేకాలు ప్రత్యేక పూజలు నిర్వహించారు.అనంతరం శ్రీసోమేశ్వరస్వామి ఆలయంతోపాటు తదితర ఆలయాల్లో కార్తీక పౌర్ణమి సందర్భంగా పూజలు ఘనంగా నిర్వహించారు అదేవిధంగా ఉదయం నుంచే మహిళా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు చేసిపసుపు, కుంకుమ చల్లి,మొక్కులు తీర్చుకున్నారు.