తుంగతుర్తి మండల ఆర్యవైశ్య సంఘం నూతన కార్యవర్గం ఎన్నిక

తుంగతుర్తి నవంబర్ 6 నిజం న్యూస్
తుంగతుర్తి మండల ఆర్యవైశ్య సంఘం నూతన కార్యవర్గాన్ని ఆదివారం రోజున మండల కేంద్రంలోని విద్యా భారతి పాఠశాలలో నూతన కమిటీని, గౌరవ అధ్యక్షులు ఈగ లక్ష్మయ్య ఆధ్వర్యంలో కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు.
ఆర్యవైశ్య సంఘం మండల అధ్యక్షునిగా ఓరుగంటి శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శిగా ఈగ నాగన్న, కోశాధికారిగా మా శెట్టి వెంకన్న , ఉపాధ్యక్షులుగా గోపారపు సత్యనారాయణ, ఓరుగంటే అశోక్, మా శెట్టి సోమన్న, ఎన్నికయ్యారు.
అనంతరం ఆర్యవైశ్య సంఘం భవన నిర్మాణం నూతన కార్యవర్గంలో అధ్యక్షులుగా పోలవరపు సంతోష్, ప్రధాన కార్యదర్శిగా గుమ్మడవెల్లి శ్రీనివాస్ కోశాధికారిగా సామా వెంకన్న నియమితులయ్యారు. సమావేశంలో ఆర్యవైశ్య కార్పొరేషన్ సాధనలో ప్రతి ఒక్కరు భాగస్వాములు అవుతామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం జిల్లా నాయకులు ఓరుగంటి సత్యనారాయణ బండారు దయాకర్ తల్లాడ కేదారి ,బిక్షం ,బండారు నాగన్న రమేష్, సోమన్న , గుండా వెంకన్న, తల్లాడ శ్రీను, ఓరి గుంట అశోక్, మా శెట్టి సోమన్న, తోడ సత్యనారాయణ ,వీరన్న, నాగన్న తదితరులు పాల్గొన్నారు.