తుర్కపల్లిలో టిఆర్ఎస్ శ్రేణుల సంబరాలు

సంబరాల్లో పాల్గొన్న మండల నాయకులు.
తుర్కపల్లి,నవంబర్, 6 (నిజం న్యూస్) :
ఉప ఎన్నికల్లో ఫలితాలు వెలువడిన సందర్భంగా తుర్కపల్లి మండల టిఆర్ఎస్ నాయకులు మండల చౌరస్తాలో సంబరాలను ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఎంపీపీ భూక్య సుశీల రవీందర్ నాయక్, టిఆర్ఎస్ యువనేత గట్టు తేజస్వి నిఖిల్, ఆధ్వర్యంలో ఆదివారం మండల చౌరస్తాలోని తెలంగాణ తల్లి విగ్రహం వద్ద బాణాసంచా కాల్చి కార్యకర్తలకు స్వీట్లు పంపిణీ చేశారు. సందర్భంగా వారు మాట్లాడుతూ టిఆర్ఎస్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలే కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని గెలిపించాయి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కొమ్మిరి శెట్టి నరసింహులు, కో ఆప్షన్ షరీఫ్, ప్రధాన కార్యదర్శి సాగర్ల పరమేష్ , మాజీ ఎంపీటీసీ తలారి శీను, గజం ఉప్పలయ్య,వెన్నకూచి రాంమోహన్ శర్మ,నాంసాని సత్యనారాయణ, ఉపసర్పంచ్ సీతారాజు, లచ్చిరాం, బోయిని నాగరాజు, బోయినీ సత్తయ్య, ఆకుల దేవయ్య, టిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.