మహబూబా బాద్ డిపో నూతన బస్ సర్వీస్ వేయటం పట్ల సర్వత్ర హర్షం

మహాబూబ బాద్ … మద్దిరాల.. తుంగతుర్తి… నకిరేకల్.. హైదరాబాద్… దిల్సుఖ్నగర్. ప్రతిరోజు 2ఎక్స్ప్రెస్ సర్వీసులు.
మహబూబాబాద్ దంతాలపల్లి మద్దిరాల.. వెంపటి.. గొట్టిపర్తి.. తిరుమలగిరి… హైదరాబాద్ … జగదీర్ గుట్ట వరకు ఎక్స్ప్రెస్ సర్వీస్.
మహబూబా బాద్ నుండి తుంగతుర్తి… హైదరాబాదు నుండి తుంగతుర్తికి అదనంగా 3 సర్వీసులు రావడం పట్ల పేద ప్రజల హర్షం.
సూర్యాపేట ప్రతినిధి నవంబర్ 5 నిజం న్యూస్
మహబూబాబాద్ డిపో నుండి.. తుంగతుర్తి… నకిరేకల్… దిల్సుఖ్నగర్ వరకు రెండు ఎక్స్ప్రెస్ సర్వీసులు, మహబూబాబాద్ నుండి మద్దిరాల.. వెంపటి… తిరుమలగిరి మీదుగా జగద్గిరి గుట్ట వరకు అదనంగా ఒక ఎక్స్ప్రెస్ సర్వీస్ నూతన బస్సులు రావడం పట్ల ఈ ప్రాంత ప్రజలు సర్వత్ర హర్షం వ్యక్తం చేస్తున్నారు.
సూర్యాపేట నుండి తుంగతుర్తికి 40 కిలోమీటర్ల దూరం జిల్లా డిపో ఉన్నప్పటికీ హైదరాబాద్ పోవడానికి ప్రత్యేక బస్ సర్వీసులు ఏర్పాటు చేయలేదు.. మహబూ బా బాద్ డిపో యాజమాన్యం ఈ ప్రాంత పేద ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని నూతనంగా మూడు ఎక్స్ప్రెస్ సర్వీస్ లను పొందుపరచడం మనందరి అదృష్టంగా భావించి. ఈ అవకాశాన్ని ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని మహబూబాద్ డిపో యాజమాన్యం కోరడం గమనార్వం..