అందుబాటులో లేని డాక్టర్….!..చనిపోయిన నిండు గర్భిణి

*నిండు గర్భిణి మృతి*
*మా డాక్టర్ 9 నుంచి 5 గంటల వరకే?*
*ఎవరూ లేక ప్రధమ చికిత్స అందించిన వాచ్మెన్*
*సిబ్బంది లేక ప్రభుత్వ అంబులెన్స్ లో వైద్యం*
దమ్మపేట నవంబర్ 4 నిజం న్యూస్:
దమ్మపేట మండలం మల్కారం గ్రామపంచాయతీ పెద్ద గొల్లగూడెం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రామచంద్రయ్య పాలెం కు చెందిన బత్తుల సూరి రేష్మి దంపతులు రాచూరుపల్లి వెళ్తుండగా స్థానిక దమ్మపేటలో ఉన్న సెయింట్ మేరీ స్కూల్ బస్సు ఢీ కొట్టగా సూరికి కాలు పూర్తిగా విరిగిపోగా ఇద్దరికీ తీవ్ర గాయాలు అయ్యాయి. అక్కడ ఉన్న స్థానికులు ప్రభుత్వం ఆంబులెన్స్ కు ఫోన్ చేయగా సకాలంలో వచ్చిన అంబులెన్స్ లో దమ్మపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సమయానికి డాక్టర్ అందుబాటులో లేక నిండు గర్భిణీ అయినా సూరి భార్య మృతి చెందింది. ఆసుపత్రికి తీసుకువచ్చిన అర్ధగంట వరకు డాక్టర్ రాని పరిస్థితి చోటుచేసుకుంది. సూరి భర్తకు కూడా ఆసుపత్రిలో సిబ్బంది లేక ప్రభుత్వ అంబులెన్స్ లో అంబులెన్స్ సిబ్బంది ప్రథమ చికిత్స అందిస్తూ మెరుగైన వైద్యం కోసం సత్తుపల్లి కి తరలించారు. చనిపోయిన బాధితురాల కుటుంబ సభ్యులు ఆసుపత్రి సిబ్బంది లేకపోవడం వల్లనే చనిపోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డాక్టర్ ఎందుకు లేరని బాధితురాలి కుటుంబ సభ్యులు ఆసుపత్రిలో ఉన్న నర్స్ నీ అడగగా ఈ ఆసుపత్రిలో ఉన్న డాక్టర్ ఉదయం తొమ్మిది గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకే ఉంటారని తరువాత ఉండరని గీరగా సమాధానం ఇచ్చారు. అదే ఆసుపత్రిలో పనిచేసే వాచ్మెన్ సిబ్బంది లేక తానే సూరికి ప్రథమ చికిత్స అందించడం గమనార్హం.