న్యాయవాద వృత్తిలో …. జెడ్పిటిసి దావుల

9 సంవత్సరాల అనంతరం తుంగతుర్తి కోర్టులో న్యాయవాదిగా దావుల వీరప్రసాద్, రావటం పట్ల సర్వత్ర హర్షం.
తుంగతుర్తి నవంబర్ 4 నిజం న్యూస్
అది తక్కువ కాలంలో పార్టీలో కష్టపడి రాజకీయంగా ఎదిగి జెడ్పిటిసి గా రానించి…2012 సంవత్సరంలో న్యాయవాదిగా విద్యాభ్యాసం పూర్తి పూర్తిచేసిన దావుల వీర ప్రసాద్ యాదవ్, గతంలో సూర్యాపేట, తుంగతుర్తి కోర్టులో రెండు సంవత్సరాలు న్యాయవాదిగా పనిచేసి, రాజకీయాల్లో ప్రస్తుతం అర్వపల్లి జడ్పిటిసిగా రాణిస్తున్నారు. కృషి ,పట్టుదలతో, అంకిత భావంతో తను చదివిన న్యాయవృత్తిలో పేద ప్రజలకు న్యాయం చేయాలని లక్ష్యంతో, తిరిగి 9 సంవత్సరాల అనంతరం తుంగతుర్తి కోర్టులో న్యాయవాదిగా శుక్రవారం రావడంతో ,గమనించిన మిత్రులు, బంధువులు, రాజకీయ నాయకులు ఆప్యాయతో పలకరించగా ,చిరునవ్వుతో….. సమాధానం. ఏది ఏమైనా ఈ ప్రాంత పేద ప్రజలకు న్యాయం చేయాలని ఆకాంక్షిస్తూ, సర్వత్ర హర్షం వ్యక్తం చేశారు.