మునుగోడు లో గెలిచేది టిఆర్ఎస్

తుంగతుర్తి నవంబర్ 4 నిజం న్యూస్
తుంగతుర్తి మండలం కొత్తగూడెంలో ఐకెపి దాన్యపు కొనుగోలు కేంద్రాన్ని శుక్రవారం ప్రారంభించిన తుంగతుర్తి శాసనసభ్యులు గాదరి కిషోర్ కుమార్. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ బిజెపి, కాంగ్రెస్ మునుగోడు లో ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసిన మునుగోడు ప్రజలు టిఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి అత్యధిక మెజార్టీతో గెలుపొందున్నట్లు ఎమ్మెల్యే ఆశాభావం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా బిజెపి నాయకులు కుట్రలు, కుతంత్రాలు ఆపాలన్నారు. రైతులు పండించిన పూర్తి ధాన్యాన్ని, కేంద్ర ప్రభుత్వం కొన్నా కొనకున్న, మన ప్రభుత్వం కొనుగోలు చేయనున్నట్లు తెలిపారు. రైతులు నాణ్యమైన ధాన్యాన్ని ఐకెపి కొనుగోలు కేంద్రాలకు తీసుకొని వచ్చి లబ్ధి పొందాలని కోరారు.
ఈ కార్యక్రమంలో డిసిసిబి డైరెక్టర్ గుడిపాటి సైదులు వైస్ ఎంపీపీ శ్రీశైలం యాదవ్, టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు తాటికొండ సీతయ్య, సర్పంచ్ నగరగంటి విజయ్, గుండ గాని రాములు గౌడ్, కటకం వెంకటేశ్వర్లు, చెరుకు సుజనా పరమేష్, కేతరెడ్డి లతా రెడ్డి, దొంగరి, శ్రీను, తదితరులు పాల్గొన్నారు