టి.డి. వ్యాక్సిన్ తప్పనిసరిగా వేయించాలి……..జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి

యాదాద్రి భువనగిరి జిల్లా బ్యూరో నవంబర్ 03(నిజం న్యూస్)

ధనుర్వాతం,కోరింత దగ్గు వ్యాధుల నుండి రక్షణ పొందుటకు టి.డి. వ్యాక్సిన్ తప్పనిసరిగా వేయించాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు.గురువారం నాడు కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాలులో జిల్లా వైద్యశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జిల్లా టాస్క్ ఫోర్స్ కమిటీ సమావేశంలో ఆమె అధికారులను ఉద్దేశించి మాట్లాడుతూ, ఈ నెల 7 నుండి 19 వరకు జిల్లాలో 21 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 789 ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో ఐదవ, పదవ తరగతి చదువుతున్న (10, 16 సంవత్సరముల వయస్సు గల) 19,544 మంది పిల్లలకు ధనుర్వాతం,కోరింత దగ్గు వ్యాధుల నివారణకు టి.డి. (టెటనస్ డిప్తీరియా) వ్యాక్సినేషన్ వేయడం జరుగుతుందని తెలిపారు.తల్లిదండ్రులు ముందుకు వచ్చి తప్పనిసరి తమ పిల్లలకు వ్యాక్సినేషన్ వేయించేలా కార్యాచరణ చేపట్టాలని, గ్రామ స్థాయిలో ఆశ, ఏ.ఎన్.ఎం. ల సహకారంతో విస్తృత స్థాయిలో అవగాహన కల్పించి ఐదవ, పదవ తరగతి చదువుతున్న విద్యార్థులను గుర్తించి వారందరూ వాక్సినేషన్ పొందే విధంగా చర్యలు చేపట్టాలని సూచించారు. బడికి వెళ్ళని 10, 16 సంవత్సారాల వయస్సు గల పిల్లలను గుర్తించి అంగన్వాడి కేంద్రాలలో వ్యాక్సినేషన్ వేయాలని తెలిపారు.సమావేశంలో జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ దీపక్ తివారీ, జిల్లా పరిషత్ సీఈవో కృష్ణారెడ్డి, జిల్లా వైద్య, ఆరోగ్య అధికారి డాక్టర్ కె. మల్లికార్జునరావు, జిల్లా విద్యా శాఖ అధికారి నారాయణరెడ్డి, జిల్లా ఏరియా ఆసుపత్రి డాక్టర్ చిన్నూ నాయక్, ఈడి ఎస్.సి. కార్పొరేషన్ శ్యాంసుందర్, జిల్లా పంచాయతీ అధికారి శ్రీమతి సునంద, డిప్యూటీ డిహెచ్ఎంఓ డాక్టర్ ప్రశాంత్, డాక్టర్ పరిపూర్ణ చారి,డాక్టర్ సుమన్ కళ్యాణ్, డాక్టర్ వినోద్, తదితరులు పాల్గొన్నారు.