రైతుల కష్టాల్లోనూ… విద్యార్థుల సహాయం

దేశానికి వెన్నెముక రైతులు అంటున్న విద్యార్థులు,

విద్యార్థుల సేవల పట్ల రైతులు, మేధావుల ప్రశంసలు.

నల్లగొండ నవంబర్ 3 నిజం న్యూస్

నల్లగొండ మండలం దోమలపల్లి గ్రామంలో ఐకెపి సెంటర్లో వరి ధాన్యం ఆరబెట్టగా, అకాల వర్షం రావడంతో పక్కనే ఉన్న గవర్నమేంట్ స్కూల్ విద్యార్థులు మూకుమ్మడిగా అందరు వచ్చి తడుసున్న ధాన్యపు రాసులుపై పట్టాలు కప్పి, మానవత్వం చాటారు. దీనితో రైతుల ప్రశంసలు రోడ్లుపై వెళ్లేవారు విద్యార్థులను అభినందించారు. ఏది ఏమైనా తక్షణమే జిల్లా ఉన్న అధికారులు స్పందించి, యుద్ధ ప్రాతిపదికపై కొనుగోలు కేంద్రాలలో, కాంటాలు పెట్టాలని పేద రైతులు కోరుతున్నారు.