కొలనుపాక వాగు వద్ద అదుపుతప్పి పల్టీకొట్టిన ఆటో

యాదాద్రి భువనగిరి జిల్లా బ్యూరో నవంబర్ 02(నిజం న్యూస్)
ఆలేరు మండలంలోని కొలనుపాక వాగు దగ్గర బుధవారం పన్నీరు ట్రాలీ ఆటో అదుపుతప్పి బోల్తాపడింది.రోడ్డుపై భారీ గుంతలు ఉండడంతో అదుపు తప్పి వాగు లోయలో పడిపోయింది.దీంతో ఇద్దరికీ గాయాలయ్యాయి. ప్రాణాపాయం తప్పడంతో ఊపిరి పీల్చుకున్నారు.ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి రోడ్డు మరమ్మత్తులు చేపట్టాలని స్థానికులు, ప్రయాణికులు కోరారు.