33లక్షల విలువైన గంజాయి పట్టివేత-ముగ్గురు అరెస్ట్

నవంబర్ 1 సోముల గూడెం నిజాం న్యూస్
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం సోములగూడెం క్రాస్ రోడ్డు వద్ద వాహనం లో అక్రమంగా తరలిస్తున్న 168కేజీల గంజాయి పట్టివేత-ముగ్గురు నిందితులను అరెస్ట్ చేయగా మరో ఇద్దరు ఫరార్ అయ్యారని తెలిపిన సి.ఐ నాగరాజు..
మెాతుగూడెం లో గంజాయి కొనుగోలు చేసి వైరా తరలిస్తుండగా పట్టుకున్న పోలీసులు..
నిందితులు ఖమ్మం కు చెందిన తెల్లబోయిన ఉమేష్,రెబ్బవరం కు చెందిన షేక్ అస్లాం,మరో నిందితుడు మైనర్..
ఫరార్ లో ఇద్దరు నిందితులు హరి,సందీప్ లను గాలిస్తున్నట్లు తెలిపిన సి.ఐ నాగరాజు
ఇద్దరి నిందితులను కోర్టు లో హాజరు పరిచి,మరో నిందితుడు మైనర్ ను ఖమ్మం జువైవల్ హోమ్ తరలించామని తెలిపిన సి.ఐ నాగరాజు.