సామాజిక విప్లవ కారుడు వట్టికోట ఆళ్వారుస్వామి

యాదాద్రి భువనగిరి జిల్లా బ్యూరో నవంబర్ 01(నిజం న్యూస్)
తెలంగాణ కవుల సంఘం.. సమాజంలోని దోపిడి, పెత్తందారీ వ్యవస్థ కు వ్యతిరేకంగ పోరాడి, సామాజిక వ్యవస్థలో మార్పు కోరిన వట్టికోట ఆళ్వారుస్వామి అమరుడని సీనియర్ జర్నలిస్టు సామ మల్లారెడ్డి అన్నారు.మంగళవారం స్థానిక కాచరాజు మినీ హాల్ లో జరిగిన వట్టికోట ఆళ్వారుస్వామి 102 వ జయంతి ఉత్సవాలు ఘణంగ నిర్వహించారు.ఈ సందర్భంగా మల్లారెడ్డి మాట్లాడుతూ ఒకవైపు పెన్నుతో,మరొకవైపు గన్నుతో పోరాటం చేసి ప్రజల నాయకుడయ్యాడు ఆయన అన్నారు.భారత స్వాతంత్ర్య ఉద్యమంలో, నిజాం, రజాకార్ల కు వ్యతిరేకంగా తెలంగాణ రైతాంగ పోరాట ఉద్యమంలో, గ్రంథాలయోద్యమంలో ఆయన చేసిన కృషి చరిత్రలో నిలిచిపోతుందన్నారు. నేటి యువత వట్టికోట ఆళ్వారుస్వామి ని ఆదర్శంగా తీసుకోవాలని ఆయన కోరారు.పుస్తక పఠనం ద్వారా విజ్ఞానాన్ని పెంచుకోవాలని ఆయన కోరారు. సమావేశంలో కవులు కవితలు చదివి వినిపించారు.ఈ సమావేశంలో కాచరాజు జయప్రకాష్, పాలకుర్తి రాంమూర్తి, శ్రీనివాసాచార్యులు, బట్టు రామచంద్రయ్య, షేక్ హమీద్ పాషా,జిట్టా భాస్కర్ రెడ్డి, జంపాల అంజయ్య, సత్యనారాయణ, ఎం.సత్తయ్య, వైజయంతి, రమేష్,వల్లాల విజయలక్ష్మి, సరోజ,కొడారి వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు