విద్యార్థుల అభ్యసన సామర్ధ్యం మెరుగు పడేలా భోదన ఉండాలి….. జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి

యాదాద్రి భువనగిరి జిల్లా బ్యూరో నవంబర్ 01(నిజం న్యూస్)
విద్యార్థుల అభ్యసన సామర్ధ్యం మెరుగు పడేలా భోదన ఉండాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ఉపాధ్యాయులకు సూచించారు.మంగళవారం నాడు బీబీనగర్ మండలములోని చిన్నరావులపల్లి ప్రాధమిక పాఠశాలను సందర్శించి విద్యార్ధులతో చదివించారు.పాఠశాల వసతులను పరిశీలించారు.అనంతరం బట్టుగూడెం ప్రాధమిక పాఠశాల, హైస్కూలును సందర్శించారు.7వ తరగతి విద్యార్థులను ప్రశ్నలు అడిగి సంతృప్తి వ్యక్తం చేశారు.పాఠశాలలో వసతులను,మధ్యాహ్న భోజన కార్యక్రమాన్ని పరిశీలించారు.విద్యార్ధుల అభ్యసనా సామర్ధ్యం మెరుగుపరచేదిగా బోధన కొనసాగించాలని, అక్షర దోషాలు లేకుండా వ్రాయిటకు ప్రత్యేక శ్రద్ధ కనబరచాలని సూచించారు.కార్యక్రమంలో చిన్న రావులపల్లి ప్రాథమిక పాఠశాల హెడ్మాస్టర్ భాస్కర్ రెడ్డి,బట్టుగూడెం ప్రాథమిక పాఠశాల హెడ్మాస్టర్ రాము,బట్టుగూడెం హైస్కూల్ ఇన్చార్జి హెడ్మాస్టర్ ఆదిల్ పాషా, ఉపాధ్యాయులు ఉన్నారు.