Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

గాడిదలకు గడ్డేసి.. ఆవులకు పాలు పిండితే వస్తయా…సీఎం కేసీఆర్

జనసంద్రంగా మారిన చండూరు..

సీఎం కేసీఆర్ బహిరంగ సభకు లక్షలాదిగా తరలివచ్చిన మునుగోడు ప్రజానీకం

గులాబీ మయమైన చండూరు, బంగారు గడ్డ దారులు.

నిండిన సభా ప్రాంగణంలో ఉసికేస్తే రాలనంత జనం హాజరు.

బహిరంగ సభ విజయవంతం..బారులు తీరిన జనం..,ఆనందోత్సాహాల మధ్య కదం తొక్కిన పార్టీ శ్రేణులు.

ఆధ్యంతం జన జాతరలా సాగిన సభ.

కారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీతో కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారిని గెలిపిస్తే, మునుగోడు ను గుండెల్లో పెట్టి చూసుకుంటా అని చెప్పిన సీఎం కేసీఆర్.

పెద్ద సంఖ్యలో హాజరైన TRS పార్టీ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు మరియు సీపీఐ, సీపీఎం నాయకులు కార్యకర్తలు,అభిమానులు

నల్లగొండ జిల్లా మునుగోడు నియోజకవర్గం, చండూరు మున్సిపాలిటీ పరిధిలోని బంగారిగడ్డలో నిర్వహించిన టీఆర్‌ఎస్‌ బహిరంగ సభకు టీఆర్‌ఎస్‌ అధినేత, సీఎం శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్‌ రావు హాజరై ప్రసంగించారు.

‘ఇవాళ నాతో పాటు నలుగురు తెలంగాణ బిడ్డలు హైదరాబాద్‌ నుంచి మునుగోడు వచ్చారు. నిన్నామొన్న కొంత మంది ఢిల్లీ బ్రోకర్‌గాళ్లు తెలంగాణ ఆత్మగౌరవాన్నే కొందామని.. మీకు వంద కోట్ల రూపాయలు ఇస్తాం.. మీరు పార్టీ విడిచిపెట్టి రమ్మని చెప్పి.. వాళ్లను ఎడమకాలి చెప్పుతో కొట్టి అమ్ముడుపోవుడు కాదురా.. మేం అంగట్లో సరుకు కాదు.. తెలంగాణ బిడ్డలమని.. తెలంగాణ ఆత్మగౌర బావుటాను హిమాలయపర్వతం అంత ఎత్తుకు ఎత్తారు.

తాండూరు ఎమ్మెల్యే పైలెట్‌ రోహిత్‌రెడ్డి, అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, కొల్లాపూర్‌ ఎమ్మెల్యే హర్షవర్ధన్‌రెడ్డి, పినపాక ఎమ్మెల్యే రెగా కాంతారావు లాంటివారు కావాలి రాజకీయాలకు. జాతి గౌరవాన్ని, దేశగౌరవాన్ని అంగట్లో పశువుల్లా అమ్ముడుపోకుండా.. వందకోట్లు ఇస్తామన్నా గడ్డిపోచతో సమానంగా విసిరికొట్టి తెలంగాణను కాపాడిన బిడ్డలు. వందల కోట్ల అక్రమ ధనం తెచ్చి శాసనసభ్యులను, పార్లమెంట్‌ సభ్యులను, ఇతరులను సంతలో పశువుల్లా కొని ప్రభుత్వాలను కొలగొట్టే అరాచక వ్యవస్థ మంచిదా? అని ప్రశ్నించారు.
మోదీ ఎందుకీ కిరాతకం ?
‘నరేంద్ర మోదీని అడుగుతున్నా నీకు ఇంకా. దేశంలో ప్రధాని పదవిని మించి పదవి ఇంకా లేదు కదా. ఒకసారి కాదు రెండుసార్లు అవకాశం వచ్చింది కదా? ఎందుకు ఈ కిరాతకం. ఎందుకీ అరాచకం. దేశం కోసం, సమాజానికి ఏ రకంగా మంచిదో ప్రజలకు సమాధానం చెప్పాలి. ఎందుకు ఇవన్నీ ప్రోత్సహిస్తున్నరు. మోదీ అండదండలు లేకుండానే ఆర్‌ఎస్‌ఎస్‌లో ప్రముఖ పాత్ర వహించే వ్యక్తులు హైదరాబాద్‌కు వచ్చి ఇప్పుడు చంచల్‌గూడ జైలులో ఉన్నరు. వాళ్లు ఆఫర్‌ చేసిన వందల కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చాయో విచారణ జరగాలి. దీని వెనుక ఎవరు ఉన్నరో వారు ఒక్క క్షణం కూడా పదవిలో ఉండడానికి అర్హులు కాదు. 75 సంవత్సరాల స్వతంత్ర భారతంలో ఇంత అరాచకం జరుగుతుంటే మనం మౌనంగా ఉందామా? ఆలోచించాలని కోరుతున్నా’ అని సీఎం కేసీఆర్‌ పిలుపునిచ్చారు.

గాడిదలకు గడ్డేసి.. ఆవులకు పాలు పిండితే వస్తయా

‘మౌనంగా ఉంటే.. ఆ మౌనమే శాపమైతది. ప్రేక్షకుల్లా చూసి మనది కాదు అనుకూనే సందర్భం కాదు. ప్రతి విద్యావంతుడు తీవ్రంగా తీసుకోవాల్సిన సందర్భం. దయచేసి మునుగోడులో విద్యాధికులు, కవులు, కళాకారులు, రచయితలు, అన్నదమ్ముళ్లు, అక్కాచెళ్లెల్లు ఊరికి వెళ్లిన తర్వాత చర్చ చేయాలి. ఓటు వేసేటప్పుడు దేనికో ఆశపడి, ఎవడో చెప్పిండని మాయమాటకు లొంగి ఓట్లు వేస్తే మంచి జరుగదు. మనం పండ్లు తినాలంటే ముండ్ల చెట్లు పెడితే రావు. చెట్టు పెట్టేటప్పుడే జాగ్రత్తగా పెట్టాలే. ఓటు వేసే టప్పుడు జాగ్రత్తగా వేయాలి. గాడుదలకు గడ్డేసి.. ఆవులు పిండితే పాలు రావు. గడ్డి వేసేటప్పుడే గాడిదికి వేస్తున్నామా? ఆవుకు వేస్తున్నమా? అని ఆలోచన చేయాలి’ అని సీఎం కేసీఆర్‌ సూచించారు.

మౌనంగా ఉంటే.. ఆ మౌనమే శాపమైతది. ప్రేక్షకుల్లా చూసి మనది కాదు అనుకూనే సందర్భం కాదు. ప్రతి విద్యావంతుడు తీవ్రంగా తీసుకోవాల్సిన సందర్భం. దయచేసి మునుగోడులో విద్యాధికులు, కవులు, కళాకారులు, రచయితలు, అన్నదమ్ముళ్లు, అక్కాచెళ్లెల్లు ఊరికి వెళ్లిన తర్వాత చర్చ చేయాలి. ఓటు వేసేటప్పుడు దేనికో ఆశపడి, ఎవడో చెప్పిండని మాయమాటకు లొంగి ఓట్లు వేస్తే మంచి జరుగదు. మనం పండ్లు తినాలంటే ముండ్ల చెట్లు పెడితే రావు. చెట్టు పెట్టేటప్పుడే జాగ్రత్తగా పెట్టాలే. ఓటు వేసే టప్పుడు జాగ్రత్తగా వేయాలి. గాడిద‌లకు గడ్డేసి.. ఆవుల‌ను పిండితే పాలు రావు. గడ్డి వేసేటప్పుడే గాడిదికి వేస్తున్నామా? ఆవుకు వేస్తున్నమా? అని ఆలోచన చేయాలి. మునుగోడులో యుద్ధం చేయాలి అని సీఎం కేసీఆర్‌ సూచించారు.

మునుగోడులో చేనేత కార్మికులు ఉన్నారు. దేశంలో ఏప్ర‌ధాని కూడా చేయ‌ని దుర్మార్గం మోదీ చేసిండు. ఇబ్బందుల్లో ఉన్న చేనేత‌పై 5 శాతం జీఎస్టీ వేసి శిక్షిస్తున్నారు. ఏ విధంగా చేనేత బిడ్డ‌లు బీజేపీకి ఓటు వేయాలి. ఆలోచించాలి. నాకే ఓటు వేయ్ అని అడ‌గ‌డం ధ‌ర్మ‌మేనా? ఇవాళ వామ‌ప‌క్షాలు, టీఆర్ఎస్ క‌లిసి ప్ర‌జాస్వామ్యాన్ని నిల‌బెట్టేందుకు పోరాటం చేస్తున్నాయి. ప్ర‌జాస్వామ్యంలో ఓటు అత్యంత శ‌క్తివంత‌మైన‌ది. ఆ ఓటు బ‌లంతోనే పోటు పొడుస్తాన‌ని చెప్పిన త‌ర్వాత కూడా బీజేపీకే ఓటు వేయాల్నా? ఆలోచించాలి. పోస్టుకార్డు ఉద్య‌మంపై నిర్ణ‌యం తీసుకోవాలంటే చేనేత బిడ్డలు బీజేపీకి ఓటు వేయొద్దు. నీ చేతిలో ఉన్న ఓటును బాగు, భ‌విష్య‌త్‌, దేశం కోసం వినియోగించ‌మ‌ని చెబుతున్నాను.

దేశంలో 4 ల‌క్షల మెగావాట్ల విద్యుత్ ఉత్ప‌త్తి సామ‌ర్థ్యం ఉంది. కానీ ఈ దేశం 2 ల‌క్ష‌ల మెగావాట్ల కంటే ఎక్కువ విద్యుత్ ఉత్ప‌త్తి చేయ‌లేదు. ఏంది ఈ దుర్మార్గం. మన రాష్ట్రంలో త‌ప్పా ఎక్క‌డా కూడా 24 గంట‌ల విద్యుత్ ఇవ్వ‌డం లేదు. కార్పొరేట్ల జేబులు నింపేందుకు బీజేపీ య‌త్నిస్తోంది. ప్ర‌యివేటీక‌ర‌ణ అనే పాల‌సీని బీజేపీ అవలంభిస్తోంది. ఇది ఎంత వ‌ర‌కు క‌రెక్ట్. విద్యుత్ సంస్క‌ర‌ణ‌ల పేరిట విద్యుత్ మీట‌ర్లు పెడుతామ‌ని చెబుతున్నారు. మీట‌ర్ల‌కు ఒప్పుకునే ప్ర‌స‌క్తే లేదు. మీట‌ర్ల‌ను పెట్టుకుని కొంప‌ల‌ను పొగొట్టుకుందామా? ఈ విష‌యంపై ఆలోచించాలి. ఎన్నిక‌ల్లో చేసే దుర్మార్గ‌పు ప్ర‌లోభాల‌కు ఆశ ప‌డితే గోస ప‌డుతామ‌ని కేసీఆర్ పేర్కొన్నారు.

నా బ‌లగం, నా శ‌క్తి మీరే. మీ బ‌లం చూసే మేం కొట్లాడేది. మీరే స‌హ‌క‌రించ‌క‌పోతే మేం ఏం చేయ‌గ‌లుగుతాం. ఇవాళ మీట‌ర్లు పెట్టేవారికి ఏం అవ‌కాశం ఇచ్చినా న‌న్ను ప‌క్క‌కు జ‌రిపేస్తారు. కేసీఆర్‌ను ప‌డ‌గొట్టి, తెలంగాణ‌ను క‌బ్జా చేద్దామ‌నుకున్నారని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.

ప్ర‌యివేటీక‌ర‌ణ చేద్దామ‌నుకునే వాళ్ల‌కు ఈ ఉప ఎన్నిక‌ల్లో బుద్ధి చెప్పాలి. దేశంలో 70 వేల టీఎంసీల నీరు అందుబాటులో ఉంది. భార‌త‌దేశంలో బంగారం లాంటి భూమి ఉంది. మాన‌వ సంప‌ద ఉన్న‌ది. ఇవ‌న్నీ వ‌దిలిపెట్టి వ్య‌వ‌సాయాన్ని కూడా కార్పొరేట్ గ‌ద్ద‌ల‌కు అప్ప‌జెప్పే ప్ర‌య‌త్నం జ‌రుగుతోంది. రైతులు గ‌మ‌నించాలి. న‌ష్ట‌పోయేది, కష్ట‌ప‌డేది మ‌న‌మే అనేది గుర్తుకు తెచ్చుకోవాలి. గ‌త పాల‌కుల హ‌యాంలో నీటి గోస తీరిందా? ఫ్లోరోసిస్ స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించ‌లేదు. మునుగోడు ప్ర‌జ‌ల‌ను కాపాడండి అంటే నాటి బీజేపీ ప్రభుత్వం స్పందించ‌లేదు. నేను కూడా ఇక్క‌డ‌కు వ‌చ్చిన ఏడ్చినా.. శివ్వ‌న్న‌గూడెంలో నిద్ర చేసి, మేధావుల‌తో మాట్లాడి చైత‌న్యం తీసుకొచ్చాను. సూడు సూడు న‌ల్ల‌గొండ‌.. గుండె మీద ఫ్లోరైడ్ బండ అనే పాట నేనే రాశాను. న‌ల్ల‌గొండ‌, మునుగోడుకే కాదు.. భార‌త్‌కే న‌ర‌కం చూపే జెండాలు మ‌న మ‌ధ్య తిరుగుతున్నాయి. వాటిని గుర్తుప‌ట్టాలి. ప్ర‌జ‌ల్లో అమాయ‌క‌త్వం ఉంట‌దో.. అప్ప‌టి దాకా దుర్మార్గుల ఆట‌లు కొన‌సాగుతాయి. ఓటర్లు అంద‌రూ అల‌వోక‌గా ఓటేసి ఇబ్బంది ప‌డొద్దు అని కేసీఆర్ సూచించారు.

కేంద్రం అవ‌లంభించే విధానాల వ‌ల్ల విద్యుత్, నీటి స‌మ‌స్య‌లు వ‌స్తున్నాయని ముఖ్య‌మంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. ఎనిమిదేండ్ల కింద మ‌న తెలంగాణ‌ను గుర్తు చేసుకోండి. కానీ మ‌న ప్ర‌భుత్వం వ‌చ్చిన త‌ర్వాత తెలంగాణ ప‌చ్చ‌బ‌డ్డ‌ది అని కేసీఆర్ తెలిపారు.

తెలంగాణ‌లాగే దేశాన్ని త‌యారు చేయాల‌ని పుట్టుకొస్తున్న‌దే బీఆర్ఎస్ పార్టీ. మునుగోడు ప్ర‌జ‌ల‌కు ఇదో గొప్ప అవ‌కాశం. చరిత్ర‌లో సువ‌ర్ణ అవకాశం ఈ మునుగోడుకే ద‌క్కింది. బీఆర్ఎస్‌కు పునాది రాయి పెట్టే అవ‌కాశం మీకే ద‌క్కింది. సిద్దిపేట ప్ర‌జ‌లు నన్ను తెలంగాణ పోరాటానికి పంపించారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాను. మునుగోడు విజ‌యంతోనే దేశం బాగుప‌డుత‌ది. మునుగోడును నా గుండెల్లో పెట్టుకుంటాను. మీకు అండ‌దండ‌గా ఉంటానని కేసీఆర్ తేల్చిచెప్పారు.

చర్లగూడెం ప్రాజెక్టు పూర్తి కావాలే. ఎవరు చేయాలి ? ఆపుతున్నది ఎవరు? ఒక రాష్ట్రం ఏర్పడితే.. ఒక ఊళ్లో ఇద్దరు అన్నదమ్ముళ్లు వేరుపడితే పెద్దలు ఏం చేస్తరు? ఇది నీదిరా.. గిది నీదిరా అని పంచుతరు? ఎనిమిదేళ్లవుతున్నది మహత్తరమైన ఘనత వహించిన బీజేపీ పార్టీకి, ప్రధాని మోదీకి ఎనిమిదేళ్లు చాలలేదా? మా వాటా ఇవ్వడానికి.. ఎందుకివ్వవు మోదీ? నోరు పెగలదు.. నోరు తెరవదు. నేను మహామొండి మీకు తెలుసు. మునుగోడులోని ప్రతి ఎకరానికి నీళ్లు తెచ్చే బాధ్యత నాది. ఎక్కడి వరకైనా కొట్లాడి.. తలపెట్టిన ప్రాజెక్టును పూర్తి చేసే బాధ్యత నాది. వంద పడకల ఆసుపత్రి, చండూరు రెవెన్యూ డివిజన్ కోరుతున్నారని.. ప్రభాకర్‌రెడ్డిని గెలిపిస్తే 15 రోజుల్లోనే మీ కోరిక నెరవేరుస్తా అని కేసీఆర్ హామీ ఇచ్చారు.

ఎంత వరకైనా కొట్లాడి మునుగోడులో ప్రతి ఎకరానికి సాగునీరు తెస్తానని సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. చండూరు మున్సిపాలిటీ పరిధిలోని బంగారిగడ్డలో ఆదివారం నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొని, ప్రసంగించారు. ‘చర్లగూడెం ప్రాజెక్టు పూర్తి కావాలే. ఎవరు చేయాలి ? ఆపుతున్నది ఎవరు? ఒక రాష్ట్రం ఏర్పడితే.. ఒక ఊళ్లో ఇద్దరు అన్నదమ్ముళ్లు వేరుపడితే పెద్దలు ఏం చేస్తరు? ఇది నీదిరా.. గిది నీదిరా అని పంచుతరు.. ఎనిమిదేళ్లవుతున్నది.. మహత్తరమైన ఘనత వహించిన బీజేపీ పార్టీకి, ప్రధాని మోదీకి ఎనిమిదేళ్లు చాలలేదా? మా వాటా ఇవ్వడానికి.. ఎందుకివ్వవు మోదీ? నోరు పెగలదు.. నోరు తెరవదు. నేను మహామొండి మీకు తెలుసు. మునుగోడులోని ప్రతి ఎకరానికి నీళ్లు తెచ్చే బాధ్యత నాది. ఎక్కడి వరకైనా కొట్లాడి.. తలపెట్టిన ప్రాజెక్టును పూర్తి చేసే బాధ్యత నాది. వంద పడకల ఆసుపత్రి, చండూరు రెవెన్యూ డివిజన్ కోరుతున్నారని.. ప్రభాకర్‌రెడ్డిని గెలిపిస్తే 15 రోజుల్లోనే మీ కోరిక నెరవేరుస్తా’నన్నారు.

గొడ్డలిని తెచ్చిపెట్టుకున్నరు..

గోదలాంటి ప్రభాకర్‌రెడ్డిలాంటి ఓడగొట్టి గొడ్డలిని తెచ్చిపెట్టుకున్నరు. ప్రజల్లో ఉండే మనిషి, సామాన్యుడు,�అరమరికలు తెలియని మనిషి.. గజకర్ణ గోకర్ణ విద్యలు తెలియని ప్రభాకర్‌రెడ్డిని పోయిన ఎలక్షన్లలో ఓ గొడ్డలిని తెచ్చిపెట్టుకున్నరు. ఆ గొడ్డలి పుణ్యమాని రోడ్డు.. ఏదీ సక్కగా లేదు. ప్రభాకర్‌రెడ్డిని గెలిపిస్తే.. అద్దాల్లా రోడ్లను బాగు చేయించే బాధ్యత నాది. పనులు, సేవ చేసేవారు కావాలి. గెలిచినోళ్లు పత్తాలేకుండా పోయారు కానీ.. ఓడిపోయిన ప్రభాకర్‌రెడ్డి మీ మధ్యలోనే మీ మనిషిగా ఉన్నడు. ఇలాంటోళ్లను గెలిపించుకుంటే మీ పనులు చేస్తరు’ అన్నారు.

విశ్వగురువా? విషగురువా..?

‘దేశంలో సక్కదనం ఏముంది. పైనపటారం.. లోనలొటారం.. ఢంబాచారం. మాట్లాడితే విశ్వగురు.. విషగురువా? నరుకుడు నరికితే.. ఇక్కడి నుంచి ఆడిదాకా అరాచక, కిరాచక రాజకీయాలు చేసుకుంటూ.. రాష్ట్ర ప్రభుత్వాలను కూలగొట్టుకుంటూ.. రాజకీయాలను అస్థిరపరుస్తూ సమాజాన్ని అతలాకుతలం చేస్తున్న దుర్మార్గమైన మతోన్మాద బీజేపీకి బుద్ధి చెప్పాలి. మునుగోడు చైతన్యవంతమైన గడ్డ. ఆలోచనలేకుండా గాలికి వేయొద్దు ఓటు. డాలర్‌కు వ్యతిరేకంగా రూపాయి చూస్తే 82 రూపాయాలా? నేపాల్‌, పాక్‌, బంగ్లాదేశ్‌ కరెన్సీ కన్నా అధ్వాన్నంగా ఉంటదా? ఇండియా ఆకలి రాజ్యంగా మారుతుందా? అని ప్రశ్నించారు సీఎం కేసీఆర్‌.
రూపాయి పతనం, ధరల పెరుగుదలకు కారణం ఎవరు?
‘ఎన్నో ప్రకృతి వనరులు, సంపదలు ఉన్న ఈ దేశంలో నిరుద్యోగం తాండవిస్తుందా? రూపాయి పతనానికి బాధ్యులు ఎవరు? ధరల పెరుగుదలకు కారణం ఎవరు? సిలిండర్‌ రూ.1200 చేసింది ఎవడు? పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెంచెంది ఎవడు? మరీ మళ్లీ ఓటు వేయాలా? అంత పౌరుషం లేకుండా ఉన్నమా? ఆలోచన చేయాలి. అర్థమై తర్వాత కూడా.. కానట్టు చేస్తే మన బతుకులు వ్యర్థం అవుతాయ్‌. నడవది మా నాటకం అని బుద్ధి చెప్పాలి సందర్భం వచ్చినప్పుడు. ఆ సందర్భమే మీ చేతిలో ఉన్న ఆయుధం ఓటు. ఆ ఓటును సక్రమంగా వినియోగిస్తే ఇలాంటి వారికి బుద్ధి వస్తుంది. ఈ ప్రైవేటీకరణ నడువది?’ సీఎం కేసీఆర్‌ స్పష్టం చేశారు.

విద్యుత్ శాఖ మంత్రి జ‌గ‌దీశ్ రెడ్డి బంగారిగ‌డ్డ బ‌హిరంగ స‌భ‌లో లేక‌పోవ‌డాన్ని సీఎం కేసీఆర్ ప్ర‌స్తావించారు. బ‌హిరంగ స‌భ‌లో కేసీఆర్ మాట్లాడుతూ.. జ‌గ‌దీశ్ రెడ్డితో త‌న‌కు అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.

మంత్రి జ‌గ‌దీశ్ రెడ్డి లేకుండా గ‌త 20 ఏండ్ల‌లో ఏ స‌భ‌లో కూడా మాట్లాడ‌లేద‌ని సీఎం గుర్తు చేశారు. 2001 నుంచి ఆయ‌న ఉద్య‌మంలో ఉన్నోడు. నేను ఇక్క‌డ‌కు వ‌చ్చే ముందు బాధ‌తో వ‌చ్చాను. ఏం త‌ప్పు చేసిండు జ‌గ‌దీశ్ రెడ్డి. ఎందుకు పంపించారు ఇక్క‌డ్నుంచి ఆయ‌న‌ను. ఎందుకు నిషేధించారు. ఆయ‌న గుండాగిరి చేసిండా? ఎవ‌రినైనా కొట్టిండా? దౌర్జ‌న్యం చేసిన‌మా? అస‌లు టీఆర్ఎస్ పార్టీకి ఆ చ‌రిత్ర ఉందా? వామ‌ప‌క్షాల‌కు ఆ చ‌రిత్ర ఉందా? ఏం దౌర్జ‌న్యం చేశామ‌ని? ప్ర‌శాంత వాతావ‌ర‌ణంలో మా ప్ర‌చారం మేం చేసుకుంటున్నాం. ఈ రోజు ఆ బాధ ఉంది అని కేసీఆర్ పేర్కొన్నారు.

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్ర‌భుత్వంపై ముఖ్య‌మంత్రి కేసీఆర్ బంగారిగ‌డ్డ బ‌హిరంగ స‌భ వేదిక‌గా నిప్పులు చెరిగారు. ఎమ్మెల్యేల‌ను కొనుగోలు చేస్తూ.. ఆయా రాష్ట్రాల ప్ర‌భుత్వాల‌ను ప‌డగొడుతున్న మోదీపై కేసీఆర్ ధ్వ‌జ‌మెత్తారు. ఢిల్లీ పీఠాన్ని క‌దిలించేంత విష‌యం త‌న ద‌గ్గ‌ర ఉంద‌ని, రాబోయే రోజుల్లో అవ‌న్నీ బ‌య‌ట‌ప‌డుతాయ‌ని కేసీఆర్ స్ప‌ష్టం చేశారు.

ఢిల్లీ నుంచి వ‌స్తిరి. దొంగ‌త‌నంగా ఎమ్మెల్యేల‌ను కొనే ప్ర‌య‌త్నం చేసిరి. దొరికిరి. ఇప్పుడు జైల్లోనే ఉండిరి. ఎవ‌డో ఒక‌డు వ‌చ్చి తల‌మాసినోడో త‌డిబ‌ట్ట‌ల‌తోని ప్ర‌మాణం చేస్తావా? ఇంకొక‌డు వ‌చ్చి పొడిబ‌ట్ట‌ల‌తోని ప్ర‌మాణం చేస్తావా? ఇది రాజ‌కీయ‌మా? దొరికిన దొంగ‌లు జైల్లో ఉన్న‌రు. నేను ఎక్కువ మాట్లాడ‌లేక‌పోతున్నా. ఎందుకంటే నేను రాజ్యాంగ‌బ‌ద్ధ‌మైన ముఖ్య‌మైన ప‌ద‌విలో ఉన్నా. కేసు న్యాయ‌స్థానాల్లో ఉంది. తేలుత‌ది. నేను మాట్లాడితే దాన్ని ప్ర‌భావితం చేసినా అంటారు. అందుకే ఆ విష‌యం నేను ఎక్కువ చెప్త‌లేను. కానీ ఒక్క‌మాట చెప్తున్నా సూచ‌న‌ప్రాయంగా. నిన్న‌మొన్న మీరు టీవీల్లో చూసింది గింతే. కానీ దొరికిన దొంగ ఇంత ఉన్న‌ది. ఢిల్లీ పీఠ‌మే దుమ్ము దుమ్ము రేగిపోయే ప‌రిస్థితి ఉన్న‌ది. రాబోయే రోజుల్లో అవ‌న్నీ బ‌య‌ట‌ప‌డుతాయి.

ఈ దుర్మార్గుల‌ను కూక‌టివేళ్ల‌తో పీకేసి, బంగాళాఖాతంలో విసిరేస్తే త‌ప్ప ఈ భార‌త‌దేశానికి నివృత్తి లేదు. భార‌త‌దేశానికి నిష్కృతి లేదు. ఈ మ‌తోన్మాదులు, పెట్టుబ‌డిదారుల తొత్తులు, ఈ పిచ్చి వ్య‌క్తులు, అరాచ‌కం సృష్టించే వ్య‌క్తులు, ప్ర‌జాస్వామికంగా గెలిచిన ప్ర‌భుత్వాల‌ను ఇష్టారాజ్యంగా కూల‌గొట్టే దుర్మార్గుల‌ను త‌న్ని తరిమేయ‌క‌పోతే, సాగ‌నంప‌క‌పోతే ఈ దేశం బాగుప‌డ‌దు. ద‌య‌చేసి మీరంద‌రూ కూడా ఆలోచించాలి అని ఓటర్ల‌కు కేసీఆర్ సూచించారు.

ప్రధాని నరేంద్ర మోదీపై రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఫైర్‌ అయ్యారు. విశ్వగురువా..? విష గురువా? అంటూ మండిపడ్డారు.

దేశంలో ఏం సక్కదనం ఉందని, పైనపటారం.. లోనలొటారం.. ఢంబాచారం అంటూ విమర్శించారు. మాట్లాడితే విశ్వగురు అంటారనీ.. విశ్వ గురువా.. విషగురువా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అరాచక, కిరాచక రాజకీయాలు చేస్తున్న, రాష్ట్ర ప్రభుత్వాలను కూలగొట్టుకుంటూ.. రాజకీయాలను అస్థిరపరుస్తూ సమాజాన్ని అతలాకుతలం చేస్తున్న దుర్మార్గమైన మతోన్మాద బీజేపీ పార్టీకి బుద్ధి చెప్పాలని సీఎం కేసీఆర్‌ ప్రజలకు పిలుపునిచ్చారు. మునుగోడు చైతన్యవంతమైన గడ్డ అనీ, ఆలోచనలేకుండా గాలికి వేయొద్దు ఓటు వేయొద్దని సూచించారు.

ధరల పెరుగుదలకు కారణం ఎవరు?.. ప్రశ్నించిన కేసీఆర్‌

డాలర్‌తో పోల్చి చూస్తే రూపాయి.. 82 రూపాయలుగా ఉందని సీఎం కేసీఆర్‌ తెలిపారు. నేపాల్‌, పాక్‌, బంగ్లాదేశ్‌ కరెన్సీ కన్నా అధ్వాన్నంగా ఉంటదా? అని ప్రశ్నించారు. ఇండియా ఆకలి రాజ్యంగా మారుతుందా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఎన్నో ప్రకృతి వనరులు, సంపదలు ఉన్న ఈ దేశంలో నిరుద్యోగం తాండవిస్తుందా?, రూపాయి పతనానికి బాధ్యులు ఎవరు అని నిలదీశారు సీఎం కేసీఆర్‌. ధరల పెరుగుదలకు కారణం ఎవరు? సిలిండర్‌ రూ.1200 చేసింది ఎవడు? పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెంచెంది ఎవడు? మండిపడ్డ ఆయన.. ధరలు పెంచిన బీజేపీకి మళ్లీ ఓటు వేయాలా? అని ప్రశ్నించారు. అంత పౌరుషం లేకుండా ఉన్నమా? ఆలోచన చేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అర్థమై తర్వాత కూడా.. కానట్టు చేస్తే మన బతుకులు వ్యర్థం అవుతాయని హెచ్చరించారు. సందర్భం వచ్చినప్పుడు.. నడవది మా నాటకం అని బుద్ధి చెప్పాలన్నారు. ఆ సందర్భమే మీ చేతిలో ఉన్న ఆయుధం ఓటని, ఆ ఓటును సక్రమంగా వినియోగిస్తే అలాంటి వారికి బుద్ధి వస్తుందన్నారు.