టీఆర్ఎస్ ఎమ్మెల్యే ల జోలికి వస్తే ఖబడ్దార్

-టిఆర్ఎస్ ఎమ్మెల్యేలతో బిజెపి బెర సారలా సిగ్గు సిగ్గు*
చేవెళ్ల, అక్టోబర్ 29 (నిజం న్యూస్)
టిఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు విషయంలో చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య తీవ్రంగా మండిపడ్డారు…. నిన్న విడుదలైన ఆడియోలలో చేవెళ్ల, పరిగి, కొడంగల్ ఎమ్మెల్యే లు బీజేపీ పార్టీలో చేరుతున్నట్లు వచ్చిన వార్తలపై ఎమ్మెల్యే యాదయ్య స్పందించారు.బీజేపి ఒక మతతత్వ పార్టీ అని ఆ పార్టీలో దళితులకు అడుగడుగునా అవమానాలే జరుగుతున్నాయని దళితుల పట్ల వివక్షత చూపించే పార్టీలో చేరే ప్రసక్తే లేదని ఇది ముమ్మాటికి బిజెపి పార్టీ నాయకుల కుట్ర అని అన్నారు. మళ్ళీ టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల జోలికి వస్తే చెప్పుతో కొడతానని ఘాటుగా వ్యాఖ్యానించారు. తనపై ఆడియోలో ఆరోపణలు చేసిన వారు చిత్తశుద్ధి ఉంటే నిరూపించాలని డిమాండ్ చేశారు.మునుగోడు ఉప ఎన్నికల్లో బిజెపి పార్టీ ఓడిపోతుందని విషయం తెలుసుకొని టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల బెరాసరాలు చేస్తున్నారని అన్నారు.
ఈ కార్యక్రమంలో షాభాద్ జెడ్పిటిసి పట్నం అవినాష్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ మిట్ట వెంకట రంగారెడ్డి, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మల్గరి రమణారెడ్డి,పోలీస్ రంగారెడ్డి ఏఎంసి వైస్ చైర్మన్ నర్సింలు, చేవెళ్ల మండల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు పెద్దోళ్ల ప్రభాకర్,రవీందర్, ఏం సి డైరెక్టర్ మొహమ్మద్ ఫయాజ్ తెరాస యూత్ నాయకులు శేఖర్,రవీందర్,హన్మంతు రెడ్డి, గని, నవాబ్ పేట తెరాస నాయకులు